Telugu Global
NEWS

రూ.66లక్షలు ఇచ్చి చంద్రబాబు అఫిడవిట్ వేయించారు....

ఏపీలో హైకోర్టు భవన ఏర్పాటు ఇప్పుడు దుమారం రేపుతోంది. అంతర్జాతీయ టెక్నాలజీతో హైకోర్టును నిర్మిస్తున్నామని చెప్పిన ఏపీ ప్రభుత్వం… తీరా హైకోర్టు విభజన తర్వాత కొత్త పల్లవి అల్లుకుంది. ఇంత హడావుడిగా ఎలా హైకోర్టును విభజిస్తారని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అయితే హైకోర్టు విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. హైకోర్టు విభజన కేసును సుప్రీం కోర్టు విచారిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. డిసెంబర్‌ 15నాటికి అంతర్జాతీయ టెక్నాలజీతో, […]

రూ.66లక్షలు ఇచ్చి చంద్రబాబు అఫిడవిట్  వేయించారు....
X

ఏపీలో హైకోర్టు భవన ఏర్పాటు ఇప్పుడు దుమారం రేపుతోంది. అంతర్జాతీయ టెక్నాలజీతో హైకోర్టును నిర్మిస్తున్నామని చెప్పిన ఏపీ ప్రభుత్వం… తీరా హైకోర్టు విభజన తర్వాత కొత్త పల్లవి అల్లుకుంది.

ఇంత హడావుడిగా ఎలా హైకోర్టును విభజిస్తారని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అయితే హైకోర్టు విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది.

హైకోర్టు విభజన కేసును సుప్రీం కోర్టు విచారిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. డిసెంబర్‌ 15నాటికి అంతర్జాతీయ టెక్నాలజీతో, అద్భుతమైన భవనాలు సిద్ధం చేస్తామని అఫిడవిట్‌ లో తెలిపింది. దాంతో ఏపీ ప్రభుత్వం భవనాలు సిద్ధం చేస్తామని చెబుతుంటే… మీరెందుకు హైకోర్టును విభజిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో కేంద్రం జనవరి ఒకటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు కోర్టులను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా అమరావతిలో హైకోర్టు భవనం ఇంకా సిద్ధం కాలేదు. న్యాయమూర్తుల క్యార్టర్స్‌ నిర్మాణం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి.

తాత్కాలిక హైకోర్టు భవనంగా సీఎం క్యాంపు ఆఫీస్‌ను వాడుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. న్యాయమూర్తులకు నోవాటెల్ హోటల్‌లో బస ఏర్పాటు చేస్తోంది. కానీ కోర్టు సిబ్బంది పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది.

ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని న్యాయవాదుల అసోసియేషన్ మండిపడుతోంది. డిసెంబర్‌ 15నాటికి అద్భుతమైన హైకోర్టు భవనాలను సిద్ధం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయడం వల్లే హైకోర్టు విభజన జరిగిందని సీనియర్ న్యాయవాదులు నాగిరెడ్డి, సుధాకర్‌ వ్యాఖ్యానించారు.

అద్భుతమైన హైకోర్టు భవనాలు డిసెంబర్‌ 15కు సిద్ధమవుతాయని ఫాలీ నారిమన్‌కు 66లక్షల రూపాయల ఫీజు చెల్లించి మరీ చంద్రబాబు అఫిడవిట్ వేయించారని వివరించారు.

నాలుగున్నరేళ్ల పాటు హైకోర్టు భవనాల గురించి ఆలోచించకుండా ఆఖరిలో చంద్రబాబు చేస్తున్న పనుల వల్ల న్యాయమూర్తులు కూడా రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ఇప్పటికైనా భవనాలు పూర్తి కాలేదు కాబట్టి…. మరో కొన్ని నెలలు గడువు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన చంద్రబాబు…. ఆ పని చేయకపోగా హైకోర్టు విభజన కూడా కుట్రపూరితమేనని వ్యాఖ్యానించడం అంటే నేరుగా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడమేనని విమర్శించారు.

చంద్రబాబు ఆ పని చేయక పోవడంతో చివరకు న్యాయవాదుల అసోసియేషనే…. గడువు పెంపు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు సుధాకర్, నాగిరెడ్డి.

First Published:  29 Dec 2018 7:26 AM IST
Next Story