Telugu Global
National

కాంగ్రెస్‌కు షాక్‌... సోనియా, రాహుల్‌ పేర్లు చెప్పిన మైఖేల్‌ క్రిస్టియన్

అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కాంగ్రెస్‌ను కలవర పెడుతోంది. తాజా పరిణామం కాంగ్రెస్‌ను మరింత అలజడికి గురి చేస్తోంది. కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యాపారవేత్త మైఖేల్‌ క్రిస్టియన్‌… ఈడీ విచారణలో సంచలన విషయాలే వెల్లడించారు. మైఖేల్ నేరుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లనే వెల్లడించారు. విచారణలో మైఖేల్ … సోనియా, రాహుల్ పేర్లు చెప్పినట్టు ఈడీ… పాటియాల హౌజ్‌ కోర్టుకు తెలియజేసింది. దీంతో రాజకీయంగా దుమారం రేగింది. ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ దాడి మొదలుపెట్టింది. […]

కాంగ్రెస్‌కు షాక్‌... సోనియా, రాహుల్‌ పేర్లు చెప్పిన మైఖేల్‌ క్రిస్టియన్
X

అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కాంగ్రెస్‌ను కలవర పెడుతోంది. తాజా పరిణామం కాంగ్రెస్‌ను మరింత అలజడికి గురి చేస్తోంది. కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యాపారవేత్త మైఖేల్‌ క్రిస్టియన్‌… ఈడీ విచారణలో సంచలన విషయాలే వెల్లడించారు.

మైఖేల్ నేరుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లనే వెల్లడించారు. విచారణలో మైఖేల్ … సోనియా, రాహుల్ పేర్లు చెప్పినట్టు ఈడీ… పాటియాల హౌజ్‌ కోర్టుకు తెలియజేసింది. దీంతో రాజకీయంగా దుమారం రేగింది. ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ దాడి మొదలుపెట్టింది.

అయితే మైఖేలే నేరుగా సోనియా, రాహుల్ పేర్లు చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు తమ నిజాయితీని నిరూపించుకోవాలని బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు. విచారణలో ఏ సందర్భంలో సోనియా, రాహుల్ పేర్లను మైఖేల్ చెప్పారన్నది తెలియాల్సి ఉంది.

అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్ల కొనుగోలుకు యూపీఏ హయాంలో భారత ప్రభుత్వం మొత్తం 3,600 కోట్లు వెచ్చించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అగస్టా కంపెనీ ఏకంగా 30 మిలియన్ యూరోలను లంచాల రూపంలో ఖర్చు చేసింది.

ఈ మొత్తం మన కరెన్సీలో లెక్కిస్తే… 227 కోట్లు. ఇందులో పలువురు కాంగ్రెస్ పెద్దలకు భారీగా ముడుపులు ముట్టాయన్నది ప్రధాన ఆరోపణ. ఇటీవలే విదేశాల నుంచి మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చారు. కోర్టు అనుమతితో దర్యాప్తు సంస్థలు అతడిని విచారిస్తున్నాయి.

First Published:  29 Dec 2018 12:35 PM IST
Next Story