జేసీ పది కోట్ల వ్యాఖ్యలపై నిశ్చల్ రియాక్షన్
వైఎస్ జగన్ అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నారని…. హిందూపురం మాజీ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్‌ను జగన్ పది కోట్లు డిమాండ్ చేశారని… దాంతో నవీన్ నిశ్చల్ బోరున ఏడుస్తున్నారని ఇటీవల అనంతపురం ధర్మపోరాట దీక్షలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నవీన్ నిశ్చల్ స్పందించారు. జగన్ తనను డబ్బులు అడిగారన్నది అవాస్తవమని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం దివాకర్ రెడ్డి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్ తనను ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు […]

వైఎస్ జగన్ అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నారని…. హిందూపురం మాజీ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్‌ను జగన్ పది కోట్లు డిమాండ్ చేశారని… దాంతో నవీన్ నిశ్చల్ బోరున ఏడుస్తున్నారని ఇటీవల అనంతపురం ధర్మపోరాట దీక్షలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నవీన్ నిశ్చల్ స్పందించారు.
జగన్ తనను డబ్బులు అడిగారన్నది అవాస్తవమని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం దివాకర్ రెడ్డి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
జగన్ తనను ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు నిశ్చల్. తాను ఏడ్చానని జేసీకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. జగన్ తననే కాదు… ఏ నేతను కూడా డబ్బులు అడిగిన సంఘటనలు లేవన్నారు.
జగనే సొంత డబ్బు ఖర్చు పెడుతూ రేయింబవళ్లు కష్టపడుతూ పార్టీని ఈ స్థాయికి తెచ్చారని నిశ్చల్ చెప్పారు.
కుటిల రాజకీయాల కోసం జేసీ ఇలాంటి అసత్యాలు చెప్పడం మానుకోవాలని నిశ్చల్ సూచించారు. జేసీ కుటిల రాజకీయాల్లో తమలాంటి వారిని పావులుగా చేయవద్దని కోరారు.