Telugu Global
National

ఇక నుంచి మీకు ఇష్టమైన ఛానల్స్‌ను మీరే ఎంపిక చేసుకోవచ్చు

ప్రస్తుతం దేశమంతా జరుగుతున్న చర్చ రేపటి నుంచి పే ఛానల్స్ ప్రసారాలు వస్తాయా లేదా నిలిచిపోతాయా అనే దాని పైనే..! ఇవాళ అర్ధరాత్రి నుంచి ట్రాయ్ నిబంధనలు అమలులోనికి వస్తుండటంతో సామాన్యుల్లో గందరగోళం నెలకొంది. అటు కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లు గానీ ఇటు ప్రభుత్వం గానీ ఈ విషయంపై ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు అందించలేదు. ఈ నేపథ్యంలో ట్రాయ్ ఒక నిర్ణయం తీసుకుంది. ‘వినియోగదారుడికే ఛానల్స్ ఎంపిక’ అనే నిబంధన ఇవాళ అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చినా […]

ఇక నుంచి మీకు ఇష్టమైన ఛానల్స్‌ను మీరే ఎంపిక చేసుకోవచ్చు
X

ప్రస్తుతం దేశమంతా జరుగుతున్న చర్చ రేపటి నుంచి పే ఛానల్స్ ప్రసారాలు వస్తాయా లేదా నిలిచిపోతాయా అనే దాని పైనే..! ఇవాళ అర్ధరాత్రి నుంచి ట్రాయ్ నిబంధనలు అమలులోనికి వస్తుండటంతో సామాన్యుల్లో గందరగోళం నెలకొంది. అటు కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లు గానీ ఇటు ప్రభుత్వం గానీ ఈ విషయంపై ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు అందించలేదు. ఈ నేపథ్యంలో ట్రాయ్ ఒక నిర్ణయం తీసుకుంది.

‘వినియోగదారుడికే ఛానల్స్ ఎంపిక’ అనే నిబంధన ఇవాళ అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చినా ఎవరికి ఏ ఛానల్స్ కావాలనే ఎంపికను జనవరి 31లోపు నిర్ణయించుకోవచ్చని.. అప్పటి వరకు ప్రసారాల నిలిపివేత జరగదని ట్రాయ్ ప్రకటించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో ట్రాయ్ కార్యదర్శి ఎస్‌కే గుప్తా సమావేశమై చర్చించారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు.

వినియోగదారుడు ఛానెళ్ల ఎంపిక ప్రక్రియ సాఫీగా, అంతరాయాలు తలెత్తకుండా చేసుకునేందుకు మరింత సమయం కావాలని…. ఇప్పటికిప్పుడు ప్రసారాలు నిలిపివేస్తే వినియోగదారుడితో పాటు ఆపరేటర్లు కూడా నష్టపోవాల్సి వస్తోందని ఎస్‌కే గుప్తాకు విన్నవించారు. దీంతో నెల రోజుల గడువు పొడిగించారు.

కాగా, వినియోగదారుని వద్దకు కేబుల్ ఆపరేటర్లే వెళ్లి ఎంపిక చేసుకునే ఛానల్స్ లిస్ట్ తీసుకోవాలని ట్రాయ్ ఆదేశించింది. డీటీహెచ్ వినియోగదారుల ఛానల్స్ ఎంపికపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

First Published:  28 Dec 2018 5:46 AM IST
Next Story