Telugu Global
National

ఆన్‌లైన్ ఆర్డర్లలో టాప్ బిర్యానీదే

భారతీయుల ఆహారపు అలవాట్లు మారినా అత్యధికులు ఇష్టంగా తింటున్నది మాత్రం బిర్యానీనే. అంతే కాకుండా ఆన్‌లైన్లో కూడా బిర్యానీనే అత్యధికంగా ఆర్డర్ చేస్తున్నారు. ఇటీవల భారతీయుల ఫుడ్ ఆర్డరింగ్ ట్రెండ్స్‌పై ‘ఫుడ్ పాండా’ ఒక సర్వే జరిపింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. బిర్యానీ, బర్గర్స్, మిల్క్ షేక్స్, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారని…. హైదరాబాద్, బెంగళూరు, ముంబాయి, ఢిల్లీ ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్ ద్వారా ఆహార పదార్థాలను తెప్పించుకుంటున్నారని ఈ సర్వే […]

ఆన్‌లైన్ ఆర్డర్లలో టాప్ బిర్యానీదే
X

భారతీయుల ఆహారపు అలవాట్లు మారినా అత్యధికులు ఇష్టంగా తింటున్నది మాత్రం బిర్యానీనే. అంతే కాకుండా ఆన్‌లైన్లో కూడా బిర్యానీనే అత్యధికంగా ఆర్డర్ చేస్తున్నారు. ఇటీవల భారతీయుల ఫుడ్ ఆర్డరింగ్ ట్రెండ్స్‌పై ‘ఫుడ్ పాండా’ ఒక సర్వే జరిపింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.

బిర్యానీ, బర్గర్స్, మిల్క్ షేక్స్, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారని…. హైదరాబాద్, బెంగళూరు, ముంబాయి, ఢిల్లీ ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్ ద్వారా ఆహార పదార్థాలను తెప్పించుకుంటున్నారని ఈ సర్వే తేల్చింది.

ఉదయం పూట ఇడ్లీ, దోశలు…. సాయంత్రం వేళ బిర్యానీ, మిల్క్ షేక్స్, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ఢిల్లీలో మటన్ టిక్కా, బటర్ చికెన్ అత్యధికంగా ఆర్డర్ చేస్తుంటే… వైజాగ్ వాసులు మాత్రం మసాలా దోశ, చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారట.

ఇక జైపూర్‌లో అయితే స్వీట్స్, వెజిటేరియన్ థాలీని ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ముంబైలో మిల్క్ షేక్స్, బర్గర్స్ అమ్మడుపోతుంటే…. బెంగుళూరులో మాత్రం షుగర్ ఫ్రీ జ్యూసులు, సలాడ్స్ ‌కు అత్యధిక డిమాండ్ ఉందట.

అయితే సాయంత్రం 8 నుంచి 9 మధ్య ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువగా ఉంటున్నాయని.. ముఖ్యంగా చికెన్ బిర్యానీకి అధిక డిమాండ్ ఉందని ఈ సర్వే తేల్చింది.

First Published:  28 Dec 2018 11:33 AM IST
Next Story