Telugu Global
NEWS

నా జోలికి వ‌స్తే తీవ్ర ప‌రిణామాలుంటాయ్

ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు స్పందించారు. సినిమాలో త‌న‌ను నెగిటివ్‌గా చూపించే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ అదే చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయని హెచ్చ‌రించారు. సినిమాలో త‌న రోల్‌ను నెగిటివ్‌గా చూపించ‌వ‌ద్ద‌ని ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చిన‌ట్టు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ నెగిటివ్‌గా తీస్తే తాను ఊరుకోబోన‌ని… తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంతో గొడ‌వ పెట్టుకోవ‌డం వ‌ల్ల సాధించేది ఏమీ ఉండ‌ద‌న్నారు. కేంద్రంతో చంద్ర‌బాబు పెట్టుకుంటున్న వైరం […]

నా జోలికి వ‌స్తే తీవ్ర ప‌రిణామాలుంటాయ్
X

ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు స్పందించారు. సినిమాలో త‌న‌ను నెగిటివ్‌గా చూపించే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు.

ఒక‌వేళ అదే చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయని హెచ్చ‌రించారు. సినిమాలో త‌న రోల్‌ను నెగిటివ్‌గా చూపించ‌వ‌ద్ద‌ని ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చిన‌ట్టు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ నెగిటివ్‌గా తీస్తే తాను ఊరుకోబోన‌ని… తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంతో గొడ‌వ పెట్టుకోవ‌డం వ‌ల్ల సాధించేది ఏమీ ఉండ‌ద‌న్నారు. కేంద్రంతో చంద్ర‌బాబు పెట్టుకుంటున్న వైరం ఏపీ ప్ర‌జ‌ల‌కు చెడు చేస్తోంద‌ని నాదెండ్ల అభిప్రాయ‌ప‌డ్డారు.

First Published:  28 Dec 2018 7:52 AM IST
Next Story