కోడెలకు టికెట్ అనుమానమేనా?
వచ్చేసారి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడట. ఈ విషయంలో తన ఆందోళనను ఇది వరకే బయటపెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని.. వారి స్థానంలో వేరే వాళ్లు పోటీ చేస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలుగుదేశం పార్టీ తొలి జాబితా కూడా వస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలోనే చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాతో రాబోతున్నాడని అంటున్నారు. […]
వచ్చేసారి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడట. ఈ విషయంలో తన ఆందోళనను ఇది వరకే బయటపెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు.
చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని.. వారి స్థానంలో వేరే వాళ్లు పోటీ చేస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తూ వచ్చాడు.
ఈ నేపథ్యంలో త్వరలోనే తెలుగుదేశం పార్టీ తొలి జాబితా కూడా వస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలోనే చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాతో రాబోతున్నాడని అంటున్నారు.
అది ఎంత మేరకు జరుగుతుందో కానీ.. తెలుగుదేశం అభ్యర్థుల గురించి ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి. టికెట్ ను కోల్పోయే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఉండబోతున్నాడని సమాచారం.
సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కోడెల తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడట. ఆయన మళ్లీ పోటీ చేస్తే అక్కడ నుంచి గెలిచే అవకాశాలు లేవని స్పష్టం అవుతున్నాయని సమాచారం. సత్తెనపల్లి నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపనున్నారని, అక్కడ నుంచి కోడెల పోటీ చేసే అవకాశాలు లేవని సమాచారం.
మరి కోడెలను సత్తెనపల్లి నుంచి తప్పిస్తే…. ఆయనకు మరొక చోట ఎక్కడైనా అవకాశం ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. లోక్ సభకు కోడెలను పంపే అవకాశం కూడా ఉందంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాబితా వస్తే కానీ…. ఈ విషయంపై పూర్తి స్పష్టత రాదు.