Telugu Global
NEWS

అప్పుడు కమ్మ వాళ్ళను తిట్టాడు.... ఇప్పుడు రెడ్లను, బలిజలను తిడుతున్నాడు

నోరు పారేసుకోవడంలో జేసీ బ్రదర్స్‌ను మించిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లేకపోవచ్చు. అలా నోరు పారేసుకున్న తరువాతనే…. వైసీపీలోకి రావాలని సకల ప్రయత్నాలూ చేసినా జగన్‌ తీసుకోలేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ వైసీపీ అని తెలిసిపోయాక వైసీపీ ఎంట్రీ కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. ఎంట్రీ దొరక్క తీవ్ర నిరాశతో ఇప్పుడు బూతులకు మళ్ళుకున్నాడు. ఒకవైపు అధికారంలోకి వచ్చే పార్టీలో ఎంట్రీ దొరకలేదన్న బాధ…. మరోవైపు జగన్‌ అధికారంలోకి వచ్చాక తన పని పడతాడేమోనన్న […]

అప్పుడు కమ్మ వాళ్ళను తిట్టాడు.... ఇప్పుడు రెడ్లను, బలిజలను తిడుతున్నాడు
X

నోరు పారేసుకోవడంలో జేసీ బ్రదర్స్‌ను మించిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లేకపోవచ్చు. అలా నోరు పారేసుకున్న తరువాతనే…. వైసీపీలోకి రావాలని సకల ప్రయత్నాలూ చేసినా జగన్‌ తీసుకోలేదు.

వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ వైసీపీ అని తెలిసిపోయాక వైసీపీ ఎంట్రీ కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. ఎంట్రీ దొరక్క తీవ్ర నిరాశతో ఇప్పుడు బూతులకు మళ్ళుకున్నాడు.

ఒకవైపు అధికారంలోకి వచ్చే పార్టీలో ఎంట్రీ దొరకలేదన్న బాధ…. మరోవైపు జగన్‌ అధికారంలోకి వచ్చాక తన పని పడతాడేమోనన్న భయం…. ఈ నోటి దూలతో వ్యక్తమవుతున్నాడు.

కులం అనే అంశం గురించి జేసీ దివాకర్ రెడ్డి మళ్ళీ మాట్లాడాడు. అయితే జేసీకి ఇలాంటివి ఏమీ కొత్త కాదు. ఇది వరకూ కూడా ఈ పాయింట్ మీద జేసీ చాలా కబుర్లు చెప్పాడు. అయితే ఇన్ని రోజులూ తెలుగుదేశం పార్టీలో పతాక స్థాయిలో ఉండిన కులపిచ్చ గురించి జేసీ మాట్లాడేవాడు. పార్టీలో తమది ఏమీ జరగడం లేదని జేసీ వాపోయేవాడు.
తెలుగుదేశం పార్టీని కమ్మ రాజ్యంగా అభివర్ణించాడు దివాకర్ రెడ్డి.

కేవలం దివాకర్ రెడ్డి మాత్రమే కాకుండా…. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడేవాడు. తెలుగుదేశం పార్టీలో తాము అనామకుల్లాంటి వాళ్లమని…. తమది ఏమీ జరగదని…. ఏదో ఖర్మ కాలి ఆ పార్టీలో చేరామన్నట్టుగా వీరు మాట్లాడేవారు.

అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కులపిచ్చను అంటించే ప్రయత్నం చేశాడు జేసీ దివాకర్ రెడ్డి. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గట్టి ఝలక్ ఇచ్చారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ల భజన చేయడంలో జేసీ దివాకర్ రెడ్డి ఆరితేరాడని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు.

ఇక వైసీపీ నేత నవీన్ నిశ్చల్ కూడా స్పందించాడు. తన విషయంలో దివాకర్ రెడ్డి అనుచితంగా మాట్లాడాడు అని ఆయన ధ్వజ మెత్తాడు. ఇలా వైసీపీ నేతలు జేసీకి వరసగా కౌంటర్లు ఇచ్చారు.

ఇక రెడ్లంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, బలిజలు జనసేన అని…. జేసీ వ్యాఖ్యానించడం తెలుగుదేశంలోనూ ఆందోళన రేపుతోంది. జేసీ మాటలతో అలాంటి వారు పార్టీకి దూరం అవుతారేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కమ్మవాళ్ళంతా ఒక్కమాట మీద నిలబడి తెలుగుదేశం వైపు ఉన్నారు. రెడ్లు గానీ, బలిజలు గానీ అలా లేరు. రెడ్లు, బలిజలు టీడీపీకి ఓట్లు వేయకపోతే తెలంగాణ ఫలితాలే ఆంధ్రాలోనూ రిపీట్‌ అవుతాయి.

ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ మరో కుకట్‌ పల్లి అవుతుంది. ఇది తెలిసే చంద్రబాబు ఎంతో జాగ్రత్తగా రెడ్లను, బలిజలను ఎంతో చాకచక్యంగా, లౌక్యంగా తమ పార్టీ వైపు పట్టుకొస్తుంటే…. దివాకర్‌ రెడ్డి నోటి దూల వల్ల…. చంద్రబాబు ఎంట్రీతో తెలంగాణ ఫలితాలు తారుమారు అయినట్టు…. ఆంధ్రా ఫలితాలు కూడా జేసీ బ్రదర్స్‌ వల్ల అలా మారుతాయేమో అని కొందరు భయపడుతున్నారు.

First Published:  28 Dec 2018 10:04 AM IST
Next Story