హైదరాబాద్‌లో ఐఐటీ రీసెర్చ్ సెంటర్
హైదరాబాద్ నగరంలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటు కానుంది. దేశంలో ప్రసిద్ది చెందిన ఖరగ్‌పూర్ ఐఐటీ నగరంలో ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దేశంలోని ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీకి చెందిన పరిశోధన కేంద్రం స్థాపించడానికి అనువైన ప్రదేశమని ఖరగ్‌పూర్ ఐఐటీ మేనేజ్‌మెంట్ భావించింది. తమ విద్యార్థులకు పై అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు పరిశోధనలకు ఉపయోగపడుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి […]
హైదరాబాద్ నగరంలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటు కానుంది. దేశంలో ప్రసిద్ది చెందిన ఖరగ్‌పూర్ ఐఐటీ నగరంలో ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దేశంలోని ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీకి చెందిన పరిశోధన కేంద్రం స్థాపించడానికి అనువైన ప్రదేశమని ఖరగ్‌పూర్ ఐఐటీ మేనేజ్‌మెంట్ భావించింది. తమ విద్యార్థులకు పై అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు పరిశోధనలకు ఉపయోగపడుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు ఇప్పటికే పంపగా… సానుకూలంగా స్పందించింది. కూకట్‌పల్లి ప్రాంతంలో 20 ఎకరాల స్థలం ఇవ్వడానికి నిర్ణయించినట్లు ఖరగ్‌పూర్ ఐఐటీ మేనేజర్ ఉత్కర్ష ప్రసాద్ తెలిపారు. డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఏరోస్పేస్ రంగాల్లో పరిశోధనలు చేసేందుకు వీలుగా నాస్కామ్ భవనంలో కూడా 2000 గజాల స్థలాన్ని ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ వర్గాలకు ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ స్పష్టం చేశారు.
ప్రతిష్టాత్మక ఐఐటీ పరిశోధనా కేంద్రం ఇక్కడ నెలకొల్పడం వల్ల స్థానిక విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని.. ప్రముఖ ఐటీ సంస్థలతో పాటు, డీఆర్‌డీఏ, హెచ్ఏఎల్ వంటి సంస్థలు కూడా స్థానికంగా ఉండటంతో డిఫెన్స్, ఏరోస్పేస్, రోబోటిక్స్ రంగాలలో హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి.