అలర్ట్ : ఏప్రిల్ 1 నుంచి హైసెక్యూరిటీ ప్లేట్ ఉండాల్సిందే...!
వాహనదారులకు కేంద్రం అల్డిమేటం జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రతీ వాహనం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌ను కలిగి ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే ప్రతీ వాహనానికి తయారీదారే నెంబర్ ప్లేట్, హాలోగ్రామ్ కలిగిన స్టిక్కర్‌ను అందించాలని…. ఈ మేరకు ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని తయారీదారులు తమ డీలర్లకు తెలియజేయాల్సి ఉంటుందని కేంద్ర రవాణా శాఖా మంత్రి లోక్‌సభకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం […]
వాహనదారులకు కేంద్రం అల్డిమేటం జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రతీ వాహనం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌ను కలిగి ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే ప్రతీ వాహనానికి తయారీదారే నెంబర్ ప్లేట్, హాలోగ్రామ్ కలిగిన స్టిక్కర్‌ను అందించాలని…. ఈ మేరకు ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని తయారీదారులు తమ డీలర్లకు తెలియజేయాల్సి ఉంటుందని కేంద్ర రవాణా శాఖా మంత్రి లోక్‌సభకు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 1 జూన్ 2005లో మోటర్ వెహికిల్ చట్టం 1989కి సవరణలు చేసింది. దీని ప్రకారం ప్రతీ వాహనం టాంపర్ ప్రూఫ్ నెంబర్ ప్లేట్ ను తప్పని సరిగా కలిగి ఉండాలి. ఈ నెంబర్ ప్లేట్లను వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఆయా ఆర్టీవో కేంద్రాలలో అందజేసేవారు. అయితే ఇటీవల హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు నాసిరకంగా ఉంటున్నాయి. అంతే కాకుండా థర్డ్ పార్టీ సంస్థలు నెంబర్ ప్లేట్లను సకాలంలో అందించలేకపోతున్నాయి.
వాహనదారులు, రవాణా శాఖ అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర రవాణా శాఖ 1989 వాహన చట్టానికి మరో సారి సవరణలు చేసింది. ఇకపై వాహనాల తయారీదారులే హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను, హాలోగ్రామ్ స్టిక్కర్లను అందించాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల బాధ్యత కూడా డీలర్లకే అప్పగించడంతో అక్కడే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను బిగించే ఏర్పాట్లు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన తప్పని సరిగా అమల్లోకి వస్తుందని నితిన్ గడ్కరి లోక్‌సభలో స్పష్టం చేశారు.