తండ్రిని న్యాయమూర్తి కాకుండా అడ్డుకున్నారు... నేడు కుమారుడు చీఫ్ జస్టిస్ అయ్యారు...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌గా చాగరి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. 2012 జూన్ 29న ఆంధ్రపద్రేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయిన ప్రవీణ్ కుమార్… 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా హైకోర్టును కేంద్రం విభజించడంతో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా చాగరి ప్రవీణ్ కుమార్‌ను నియమించారు. ప్రవీణ్ కుమార్ ప్రముఖ న్యాయవాది, మానవతావాది సి. పద్మనాభరెడ్డి కుమారుడే. 60 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో పద్మనాభ రెడ్డి చేసిన సేవలను ఇప్పటికీ […]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌గా చాగరి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. 2012 జూన్ 29న ఆంధ్రపద్రేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయిన ప్రవీణ్ కుమార్… 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా హైకోర్టును కేంద్రం విభజించడంతో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా చాగరి ప్రవీణ్ కుమార్‌ను నియమించారు.
ప్రవీణ్ కుమార్ ప్రముఖ న్యాయవాది, మానవతావాది సి. పద్మనాభరెడ్డి కుమారుడే. 60 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో పద్మనాభ రెడ్డి చేసిన సేవలను ఇప్పటికీ న్యాయప్రముఖులు పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఫీజులు చెల్లించుకోలేని పేదలకు పద్మనాభరెడ్డి పెద్ద దిక్కుగా ఉండేవారు.
ఫీజుతో నిమిత్తం లేకుండా కేసులు వాదించేవారు. ఎవరైనా పేదలు ఫీజు చెల్లించేందుకు అప్పులు చేశారని తెలిస్తే… వారికి తిరిగి డబ్బులు వెనక్కు ఇచ్చేసేవారు. కొందరికి చార్జీలకు డబ్బులు కూడా పద్మనాభరెడ్డి తన సొంత జేబులో నుంచే ఇచ్చేవారు. ఏ కేసు విషయంలోనైనా న్యాయమూర్తులు ఒక నిర్ధారణకు రాలేకపోతే పద్మనాభరెడ్డి సలహాలు తీసుకునే వారు.
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఎవరైనా చనిపోతే కేసు నమోదు చేయాలా? వద్దా? అన్న దానిపై న్యాయమూర్తులు ఒక నిర్ణయానికి రాలేని సమయంలో కోర్టు సహాయకారిగా పద్మనాభరెడ్డి నియమితులయ్యారు.
ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు నిరూపించుకోవాలని, కేసే నమోదు చేయకుండా పోలీసులే అది ఎన్‌కౌంటర్ అని తీర్పులు ఇచ్చుకోవడం సరికాదని పద్మనాభరెడ్డి సూచించారు. దీంతో ఎన్‌కౌంటర్ జరిగితే పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది.
వామపక్షవాదిగా, ప్రజా ఉద్యమాలకు పద్మనాభరెడ్డి అండదండలు కూడా అందించారు. అయితే ఇంత ఘనత ఉన్న పద్మనాభరెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా మాత్రం కాలేకపోయారు. పద్మనాభరెడ్డి వామపక్ష భావజాలాన్ని చూపుతూ… ఈయనకు కొన్ని రాజకీయ విశ్వాసాలున్నాయంటూ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో ఆయన న్యాయమూర్తి కాలేకపోయారు.
పద్మనాభరెడ్డి అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పద్మనాభరెడ్డిని న్యాయమూర్తి కాకుండా పోలీసులు అడ్డుకున్నప్పటికీ… ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ న్యాయమూర్తి కాగలిగారు. ఇప్పుడు ఏపీ తొలి చీఫ్ జస్టిస్‌గా రాబోతున్నారు.