జనవరి 1న అమ్మాయి పుడితే 5 లక్షల నజరానా
ప్రస్తుతం గర్భంతో ఉండి మరో రెండు మూడు రోజుల్లో కాన్పు అయ్యే వారికి బెంగళూరు మేయర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జనవరి 1న ఎవరైనా అమ్మాయికి జన్మనిస్తే వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. గత ఏడాది కూడా బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఇలాంటి పథకాన్నే ప్రవేశపెట్టింది. ‘పింక్ బేబీ’ పేరుతో ఆర్థిక సహాయాన్ని అందించారు. కాగా, ఈ పథకం బీబీఎంపీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులకు […]
ప్రస్తుతం గర్భంతో ఉండి మరో రెండు మూడు రోజుల్లో కాన్పు అయ్యే వారికి బెంగళూరు మేయర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జనవరి 1న ఎవరైనా అమ్మాయికి జన్మనిస్తే వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
గత ఏడాది కూడా బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఇలాంటి పథకాన్నే ప్రవేశపెట్టింది. ‘పింక్ బేబీ’ పేరుతో ఆర్థిక సహాయాన్ని అందించారు.
కాగా, ఈ పథకం బీబీఎంపీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులకు మాత్రమే వర్తిస్తుందని నగర మేయర్ గంగాంబిక తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందించే ఈ పారితోషికాన్ని చిన్నారుల పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని అన్నారు.
ఆడపిల్లల భ్రూణ హత్యలను నివారించేందుకే ఈ పథకం ప్రవేశపెట్టామని…. వారి చదువు, వివాహ సమయంలో ఈ డబ్బు ఉపయోగపడుతుందని మేయర్ అంటున్నారు.
ఈ ఏడాది జనవరి 1న పుట్టిన వారికే కాకుండా 2వ తేదీన పుట్టినా సరే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని మేయర్ స్పష్టం చేశారు.