Telugu Global
Cinema & Entertainment

లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి!

రేపు మధ్యాహ్నం 12:30కు అల్లు శిరీష్ ‘ABCD’ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు, అల్లు శిరీష్ కి ఫాదర్ గా, కీ రోల్ లో కనిపించనున్నాడు. మళయాళ సూపర్ హిట్ సినిమా ‘ABCD’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు శిరీష్ డిఫెరెంట్ కనిపించనున్నాడు. బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడిలా అల్లు శిరీష్ ఈ […]

లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి!
X
రేపు మధ్యాహ్నం 12:30కు అల్లు శిరీష్ ‘ABCD’ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు, అల్లు శిరీష్ కి ఫాదర్ గా, కీ రోల్ లో కనిపించనున్నాడు. మళయాళ సూపర్ హిట్ సినిమా ‘ABCD’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు శిరీష్ డిఫెరెంట్ కనిపించనున్నాడు.
బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడిలా అల్లు శిరీష్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మలయాళంలో ఈ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషించాడు. తనని ఎలాగైనా మార్చాలనే ఉద్దేశంతో, తక్కువ డబ్బులిచ్చి అమెరికా నుంచి ఇండియాకు పంపిస్తాడు తండ్రి. అప్పుడు అల్లు శిరీష్ ఎదుర్కొన్న పరిస్థితులేంటి అనే కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ మూవీ.
సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురే,్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాను సమర్పించనున్నాడు. జుధా సాంధీ ఈ మూవీకి మ్యూజిక్ డైరక్టర్.
First Published:  28 Dec 2018 2:40 AM IST
Next Story