Telugu Global
NEWS

టీ-పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి?

ఉన్నది ఒకే ఒక్క పోస్టు. ఆ పోస్టు కోసం కాంగ్రెస్ లో కుర్చీలాట నడుస్తోంది. దానికోసం ఐదుగురు పోటీపడుతున్నారు. పైగా అందరూ సీనియర్లే. అందుకే హైకమాండ్ కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇంతకీ అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎవరు? తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయంతో టీపీసీసీకి కూడా కొత్త అధ్యక్షుడు వస్తారా? వస్తే అధిష్టానం చాయిస్ ఎవరు? మరోసారి సీనియర్లకు అవకాశం ఇస్తారా? లేక ఇంకా ఎవరినైనా మరోసారి ఆ కుర్చీలో కూర్చోబెడుతారా అన్నది […]

టీ-పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి?
X

ఉన్నది ఒకే ఒక్క పోస్టు. ఆ పోస్టు కోసం కాంగ్రెస్ లో కుర్చీలాట నడుస్తోంది. దానికోసం ఐదుగురు పోటీపడుతున్నారు. పైగా అందరూ సీనియర్లే. అందుకే హైకమాండ్ కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇంతకీ అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎవరు? తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయంతో టీపీసీసీకి కూడా కొత్త అధ్యక్షుడు వస్తారా? వస్తే అధిష్టానం చాయిస్ ఎవరు? మరోసారి సీనియర్లకు అవకాశం ఇస్తారా? లేక ఇంకా ఎవరినైనా మరోసారి ఆ కుర్చీలో కూర్చోబెడుతారా అన్నది ఆసక్తిగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వచ్చి రెండు వారాలు గడిచిపోయాయి. రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ సమావేశమవుతుంది. అయినా ఇంకా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎవరో తెలియడం లేదు. మొన్నటి వరకు సీఎల్పీ లీడర్ గా ఉన్న జానారెడ్డి ఓడిపోయారు. దీంతో ఆ కుర్చీ కోసం గెలిచిన ఎమ్మెల్యేల మధ్య పోటీ మొదలైంది.

కాంగ్రెస్ నుంచి 19మందే గెలిచారు. వీరిలో సీనియర్లు ఎక్కువమంది ఉన్నారు. అందుకే సీఎల్పీ పదవి కోసం పోటీ పెరిగింది. ఇప్పుడు ఆ కుర్చీ కోసం ఐదుగురు పోటీపడుతున్నారు. ఈ రేసులో ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబులున్నారు.

ఈ ఐదుగురు ఎవరికి వారు కుర్చీ కోసం ఆరాటపడుతున్నారు. వారి మధ్య రగడతో సీఎల్పీ మీటింగ్ ను కూడా అధిష్టానం పెట్టడం లేదు. కొందరు ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. అందుకే ఆచితూచి అధిష్టానం వ్యవహరిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఐదుగురు సీనియర్ నేతలకు పిలుపువచ్చిందట.. శనివారం ఢిల్లీ రావాలని ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబులు కాంగ్రెస్ అధ్యక్షుడితో భేటి కానున్నారు.

అయితే ఈ ఐదుగురిలో ఎవరు సీఎల్పీ లీడర్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఎన్నికల్లో దారుణ ఓటమికి టీపీసీసీలో కీలక పదవుల్లో ఉన్న ఉత్తమ్, భట్టియే కారణమని కాంగ్రెస్ సీనియర్లు గుస్సాగా ఉన్నారట.. మళ్లీ సీఎల్పీ పదవులను వారిద్దరికి కేటాయించవద్దని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

సీఎల్పీ లీడర్ గా రాహుల్ మదిలో శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక పీసీసీ చీఫ్ వద్దనుకుంటే ఉత్తమ్ కు సీఎల్పీ ఇవ్వవచ్చు. టీపీసీసీకి సమర్ధుడైన నేతను అధిష్టానం నియమించే అవకాశాలున్నాయి. మధుయాష్కీ లేదా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించే అవకాశాలున్నాయట.

మొత్తానికి సీఎల్పీ లీడర్ ఎంపిక హైకమాండ్ కు సమస్యగా మారింది. టీపీసీసీ చీఫ్, సీఎల్పీ లీడర్ రెండు పదవులకు ముడిపడి ఉండడంతో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

First Published:  27 Dec 2018 7:11 AM IST
Next Story