వంద కోట్ల క్లబ్ లో చేరిన కేజీఎఫ్
2018 ఎండింగ్‌లో అద్భుతమైన విజయమిది. కన్నడ హీరో యశ్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించిన ప్రతిష్ఠాత్మక చిత్రం `కె.జి.ఎఫ్` సంచలన విజయం సాధించింది. కేవలం తొలి 3రోజుల్లో 58 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన కె.జి.ఎఫ్ గ్రాస్ పరంగా తొలి వారాంతానికే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వసూళ్లు సాధించిందని తెలుగు వెర్షన్ నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయి […]
BY admin27 Dec 2018 3:23 AM IST
X
admin Updated On: 27 Dec 2018 3:23 AM IST
2018 ఎండింగ్‌లో అద్భుతమైన విజయమిది. కన్నడ హీరో యశ్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కె.జి.ఎఫ్' సంచలన విజయం సాధించింది. కేవలం తొలి 3రోజుల్లో 58 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన కె.జి.ఎఫ్ గ్రాస్ పరంగా తొలి వారాంతానికే 100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వసూళ్లు సాధించిందని తెలుగు వెర్షన్ నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి తెలిపారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'గీతగోవిందం' ఈ ఏడాది రిలీజై 100కోట్ల క్లబ్ లో చేరింది. అదే తరహాలోనే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక డ్రైవర్ కొడుకు అయిన యశ్ 100 కోట్ల క్లబ్ సినిమాని అందించడం ఓ సెన్సేషన్ అని ప్రశంసించారు. కన్నడలో తొలి 100కోట్ల క్లబ్ చిత్రంగానూ కె.జి.ఎఫ్ సంచలనం సృష్టిస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్లో కేజీఎఫ్ తో పాటు పడి పడి లేచె మనసు, అంతరిక్షం సినిమాలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఈ రెండు స్ట్రయిట్ మూవీస్ కంటే కేజీఎఫ్ ను చూసేందుకే ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్ తో కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది కేజీఎఫ్. రాజమౌళి లాంటి ప్రముఖులు ప్రమోట్ చేయడం ఈ సినిమాకు కలిసొచ్చింది.
Next Story