Telugu Global
NEWS

కోడెల ట్యాక్స్ వెయ్యి కోట్లు దాటిందట....

స్పీకర్‌గా ఉన్నప్పటికీ ఈ నాలుగున్నరేళ్లలో కోడెల శివప్రసాద్‌, ఆయన కుటుంబంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీలో కోడెల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శల నుంచి… సత్తెనపల్లి, నరసరావుపేటలో కుమారుడు శివరాం దందాల వరకు అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నాలుగున్నరేళ్లలో కోడెల కుటుంబం వసూలు చేసిన డబ్బు మొత్తం వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని ఒక ప్రముఖ ప్రతిక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలు సత్తెనపల్లి, నరసరావుపేట ప్రజలను పీల్చి […]

కోడెల ట్యాక్స్ వెయ్యి కోట్లు దాటిందట....
X

స్పీకర్‌గా ఉన్నప్పటికీ ఈ నాలుగున్నరేళ్లలో కోడెల శివప్రసాద్‌, ఆయన కుటుంబంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీలో కోడెల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శల నుంచి… సత్తెనపల్లి, నరసరావుపేటలో కుమారుడు శివరాం దందాల వరకు అనేక ఆరోపణలు వచ్చాయి.

ఈ నాలుగున్నరేళ్లలో కోడెల కుటుంబం వసూలు చేసిన డబ్బు మొత్తం వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని ఒక ప్రముఖ ప్రతిక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలు సత్తెనపల్లి, నరసరావుపేట ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆ కథనం వెల్లడించింది.

కోడెల కుటుంబానికి ట్యాక్స్ కట్టకుండా ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ పనిచేసేందుకూ సాధ్యం కావడం లేదని వివరించింది. రెండు నియోజక వర్గాల్లో అపార్ట్‌మెంట్లు కట్టుకోవాలన్నా, ఇల్లు నిర్మించుకోవాలన్నా ముందుగా కోడెల కుటుంబానికి ట్యాక్స్ కట్టాల్సిందేనట.

పర్సంటేజీలు ఇవ్వనిదే రైల్వే కాంట్రాక్టు పనులు కూడా చేసే పరిస్థితి స్థానికంగా లేదని పత్రిక వివరించింది. గతంలో మామూళ్లు ఇవ్వలేదని రైల్వే సిబ్బందినే కిడ్నాప్ చేసిన అంశాన్ని గుర్తు చేసింది. వేణుగోపాల స్వామి ఆలయ స్థలంలో విలాసవంతమైన భవంతిని కోడెల నిర్మించారని వెల్లడించింది.

లోకల్‌లో ప్రతి మెడికల్ షాపులోనూ కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన కంపెనీలో తయారైన మందులనే విక్రయించేలా వ్యాపారులను వేధిస్తున్నారని పత్రిక ప్రచురించింది.

రేషన్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్‌ల మాఫియా మొత్తం కోడెల కుటుంబం కనుసన్నల్లోనే నడుస్తోందని పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. విలువైన ఖాళీ స్థలాలపై కోడెల కుటుంబం కన్నుపడితే అది కబ్జా అయిపోవాల్సిందేనని వివరించింది.

ఇలా కోడెల కుటుంబం వసూలు చేసిన అవినీతి ట్యాక్స్ ఇప్పటికి వెయ్యి కోట్లు దాటిందని సారాంశం.

First Published:  26 Dec 2018 4:55 AM IST
Next Story