Telugu Global
NEWS

ఎస్‌బీఐలోనూ బాబు మనుషులున్నారా?

ఆర్థిక నేరాలు చేసినా సరే…. టీడీపీ ప్రజాప్రతినిధులను ఏ చట్టం ఏమీ చేయలేకపోతోంది. అమ్మి అప్పు చెల్లించేందుకు ఆస్తులున్నా సరే చట్టానికి భయపడి విజయమాల్యా దేశం విడిచిపారిపోయాడు. కానీ బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్ల అప్పు తెచ్చి దాన్ని చీకటి గదుల్లోకి తరలించిన సుజనాచౌదరి మాత్రం దర్జాగా తిరుగుతున్నాడు. రాహుల్‌ గాంధీ వెనుక నిలబడగలుతున్నాడు. సేవ్ కంట్రీ అంటూ పార్లమెంట్‌ వద్ద ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్నాడు. ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో బ్యాంకుల్లో తాకట్టు […]

ఎస్‌బీఐలోనూ బాబు మనుషులున్నారా?
X

ఆర్థిక నేరాలు చేసినా సరే…. టీడీపీ ప్రజాప్రతినిధులను ఏ చట్టం ఏమీ చేయలేకపోతోంది. అమ్మి అప్పు చెల్లించేందుకు ఆస్తులున్నా సరే చట్టానికి భయపడి విజయమాల్యా దేశం విడిచిపారిపోయాడు. కానీ బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్ల అప్పు తెచ్చి దాన్ని చీకటి గదుల్లోకి తరలించిన సుజనాచౌదరి మాత్రం దర్జాగా తిరుగుతున్నాడు.

రాహుల్‌ గాంధీ వెనుక నిలబడగలుతున్నాడు. సేవ్ కంట్రీ అంటూ పార్లమెంట్‌ వద్ద ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్నాడు.

ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వందల కోట్లు అప్పు తీసుకున్న గంటా శ్రీనివాస రావు ఇంకా మంత్రిగానే కొనసాగుతున్నాడు.

రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ది అదే పరిస్థితి. ఇలా టీడీపీ నేతలు వేల కోట్లకు బ్యాంకులను ముంచినా ఇప్పటి వరకు ఒక్కరిపైనా చర్యలు లేవు. దీనికి కారణం దర్యాప్తు సంస్థలతో పాటు ప్రతి వ్యవస్థలోనూ చంద్రబాబు మనుషులు ఉండడమేనన్నది ప్రధాన ఆరోపణ.

ఇప్పుడు బ్యాంకులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు పత్రాలు చూపించి బ్యాంకు నుంచి 24 కోట్లు రుణం తీసుకున్న కేసులో టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ బాబును కాపాడేందుకు ఎస్‌బీఐ బ్యాంకు అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

సాధారణంగా ఇలా తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి రుణం తీసుకున్నట్టు తేలితే పోలీసు కేసు పెడతారు. కానీ పట్టుబడిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్సీ కావాడంతో ఎస్‌బీఐ ఉన్నతాధికారులు ఆయనను కాపాడేందుకు సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారట. రుణం మంజూరులోనూ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి.

ఎలాంటి లింక్‌ డాక్యుమెంట్లను కూడా చూసుకోకుండా ఎమ్మెల్సీకి కోట్లు అప్పగించేశారు. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో రుణ మంజూరులో కీలక పాత్ర పోషించిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ను కాపాడేందుకు కొత్త దారిలో వెళ్తున్నారు.

ఎమ్మెల్సీపై చీటింగ్ కేసు పెడితే ఆయనతో పాటు తమ బండారం కూడా బయటపడుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తీసుకున్న డబ్బు వెనక్కు ఇస్తే లోన్‌ అకౌంట్ మూసేస్తామంటూ కొత్త ప్రతిపాదన పెట్టారు.

కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో టీడీపీ పెద్దలు కూడా ఇదే ఉత్తమమని భావిస్తున్నారు. ఇలా టీడీపీ ఎమ్మెల్సీని కాపాడేందుకు బ్యాంకు అధికారులు కూడా ఉత్సాహం చూపుతుండడం ఎస్‌బీఐలోనే చర్చనీయాంశమైంది.

First Published:  25 Dec 2018 10:36 PM GMT
Next Story