Telugu Global
NEWS

బాక్సింగ్ డే టెస్ట్.... మయాంక్ అగర్వాల్ హిట్

అరంగేట్రం టెస్టులోనే సత్తా చాటిన మయాంక్ టెస్ట్ క్యాప్ పొందిన భారత 295వ క్రికెటర్ మయాంక్ బాక్సింగ్ డే టెస్ట్ తో అరంగేట్రం చేసిన భారత మూడో క్రికెటర్ భారత టెస్ట్ క్రికెట్లోకి మరో నమ్మదగిన ఓపెనర్ వచ్చి చేరాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్ ద్వారా….టెస్ట్ అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్… తొలిటెస్ట్ లోనే స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించి…అందరి దృష్టీ ఆకట్టుకొన్నాడు. గత రెండేళ్లుగా టెస్ట్ […]

బాక్సింగ్ డే టెస్ట్.... మయాంక్ అగర్వాల్ హిట్
X
  • అరంగేట్రం టెస్టులోనే సత్తా చాటిన మయాంక్
  • టెస్ట్ క్యాప్ పొందిన భారత 295వ క్రికెటర్ మయాంక్
  • బాక్సింగ్ డే టెస్ట్ తో అరంగేట్రం చేసిన భారత మూడో క్రికెటర్

భారత టెస్ట్ క్రికెట్లోకి మరో నమ్మదగిన ఓపెనర్ వచ్చి చేరాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్ ద్వారా….టెస్ట్ అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్…

తొలిటెస్ట్ లోనే స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించి…అందరి దృష్టీ ఆకట్టుకొన్నాడు. గత రెండేళ్లుగా టెస్ట్ క్యాప్ కోసం ఎంతో ఓపికతో ఎదురుచూసిన మయాంక్ చివరకు…తన కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకోగలిగాడు.

ఓపెనర్లే కీలకం….

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో నమ్మదగిన ఓపెనర్లు అత్యంత అరుదుగా కనిపిస్తారు. టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా సైతం…డిపెండబుల్ ఓపెనర్ల కొరతతో సతమతమవుతోంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో… భారత ఓపెనింగ్ జోడీ మురళీ విజయ్, కెఎల్ రాహుల్ వరుస వైఫల్యాలతో… టీమిండియా కష్టాలు అన్నీఇన్నీకావు.

దొందూ దొందే….

సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ నాలుగు ఇన్నింగ్స్ లో 49 పరుగులు మాత్రమే సాధిస్తే…యువఓపెనర్ రాహుల్ రెండుటెస్టులు, నాలుగు ఇన్నింగ్స్ లో 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

రాహుల్ గత 14 ఇన్నింగ్స్ లో 11 సార్లు ఎల్బీ లేదా బౌల్డ్ గా వెనుదిరిగాడు. అంతేకాదు గత ఏడు ఇన్నింగ్స్ లో…ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా…సెలెక్టర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.

దీంతో…విధిలేని పరిస్థితిలో భారత టీమ్ మేనేజ్ మెంట్…ఓపెనింగ్ జోడీని మార్చాలని నిర్ణయించింది. గత రెండేళ్లుగా తనవంతు కోసం ఎదురుచూస్తున్న కర్నాటక డాషింగ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు తుదిజట్టులో చోటు కల్పించింది.

మయాంక్ కు భలే చాన్స్….

దేశవాళీ క్రికెట్లో గత రెండు సీజన్లుగా నిలకడగా రాణించడమే కాదు…టన్నుల కొద్దీ పరుగులు సాధించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన మయాంక్ అగర్వాల్…కష్టానికి తగ్గ ఫలితం… ప్రస్తుత మెల్బోర్న్ టెస్ట్ ద్వారా దక్కింది.

బాక్సింగ్ డే టెస్టుగా ప్రారంభమైన…మెల్బోర్న్ టెస్ట్ లో.. మయాంక్ అగర్వాల్ కు టెస్ట్ క్యాప్ దక్కింది.

భారత 295వ క్రికెటర్….

భారత టెస్ట్ చరిత్రలో టెస్ట్ క్యాప్ అందుకొన్న 295వ ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. మయాంక్ అంతటితోనే ఆగిపోకుండా…స్టాప్ గ్యాప్ ఓపెనర్ హనుమ విహారితో కలసి బ్యాటింగ్ కు దిగాడు.

మొదటి వికెట్ కు 40 పరుగుల భాగస్వామ్యం అందించాడు. విహారి అవుట్ కావడంతో…క్రీజులోకి వచ్చిన వన్ డౌన్ పూజారాతో కలసి రెండోవికెట్ కు…హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ఆకట్టుకొన్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ బ్యాటింగ్ కొనసాగించిన మయాక్…చివరకు…95 బాల్స్ లో 6 బౌండ్రీలతో తన తొలిటెస్ట్ అర్ధశతకం పూర్తి చేశాడు.

రికార్డుల్లో మయాంక్….

చివరకు…161 బాల్స్ లో 8 బౌండ్రీలు, 1 సిక్సర్ తో 76 పరుగుల స్కోరుకు …ఫాస్ట్ బౌలర్ కమ్మిన్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఈ క్రమంలో…కంగారూ గడ్డపై టెస్ట్ అరంగేట్రం మ్యాచ్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత టెస్ట్ ఓపెనర్ గా మయాంక్ రికార్డుల్లో చేరాడు.

1999 బాక్సింగ్ డే టెస్టు ద్వారా….హృషికేశ్ కనిత్కర్, 2014 బాక్సింగ్ డే టెస్టు ద్వారా కెఎల్ రాహుల్ టెస్ట్ అరంగేట్రం చేస్తే…

ప్రస్తుత 2018 బాక్సింగ్ డే టెస్టు ద్వారా మయాంక్ అగర్వాల్ …టెస్ట్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ఓపెనర్ల నాలుగు స్తంభాలాట….

భారత టెస్ట్ క్రికెట్లోకి మయాంక్ అగర్వాల్ రూపంలో ఓ యువఓపెనర్ దూసుకురావడంతో…సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ లతో పాటు…యువఓపెనర్ కెఎల్. రాహుల్ కు గట్టిపోటీ తప్పదనడంలో ఏమాత్రం సందేహం లేదు.

వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ ను అభిమానించే మయాంక్ అగర్వాల్ నిలకడగా రాణించగలిగితే…భారత్ కు ఎటాకింగ్ ఓపెనర్ కొరత తీరినట్లే అవుతుంది.

First Published:  26 Dec 2018 10:00 AM IST
Next Story