పంచాయతీ కార్యదర్శుల నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పోర్ట్స్, వికలాంగుల కోటాలను విస్మరించడంపై కోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. స్పోర్ట్స్, వికలాంగుల కోటాను సరిచేసి ఆ తర్వాతే తిరిగి ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది హైకోర్టు. నియామకాలపై స్టే ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇందుకు హైకోర్టు అంగీకరించలేదు. 17 ప్రశ్నలకు ”కీ”లో తప్పులున్నా సరే ఎలా మార్కులు వేస్తారని ప్రశ్నించింది. 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడంపై పూర్తి […]
తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పోర్ట్స్, వికలాంగుల కోటాలను విస్మరించడంపై కోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. స్పోర్ట్స్, వికలాంగుల కోటాను సరిచేసి ఆ తర్వాతే తిరిగి ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది హైకోర్టు.
నియామకాలపై స్టే ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇందుకు హైకోర్టు అంగీకరించలేదు. 17 ప్రశ్నలకు ”కీ”లో తప్పులున్నా సరే ఎలా మార్కులు వేస్తారని ప్రశ్నించింది. 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడంపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
చేసిన తప్పును ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్ చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.