Telugu Global
Cinema & Entertainment

త్రిపాత్రాభినయం చేయనున్న బాలక్రిష్ణ

నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న సినిమా “ఎన్టీఆర్”. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఆడియో లాంచ్ లో బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా అనౌన్స్ అయిన సంగతి అందరికి తెలిసిందే. “సింహ” “లెజెండ్” లాంటి సినిమాల తరువాత తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య త్రిపాత్రాభినయం పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు […]

నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న సినిమా “ఎన్టీఆర్”. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఆడియో లాంచ్ లో బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా అనౌన్స్ అయిన సంగతి అందరికి తెలిసిందే. “సింహ” “లెజెండ్” లాంటి సినిమాల తరువాత తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య త్రిపాత్రాభినయం పోషించనున్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు బాలయ్య త్రిపాత్రాభినయం పోషించిన “అధినాయకుడు” డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ బోయపాటి మీద ఉన్న నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య. రెండు భాగాలుగా రూపొందిన “ఎన్టీఆర్” బయోపిక్ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. బోయపాటి శ్రీను కూడా ప్రస్తుతం రామ్ చరణ్ తో “వినయ విధేయ రామ” చిత్రంతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా యొక్క ఐటెం సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. అంటే ఈ సంక్రాంతికి బోయపాటి శ్రీను, బాలక్రిష్ణ బాక్స్ ఆఫీస్ బరిలో పోటి పడబోతున్నారు.

First Published:  26 Dec 2018 3:29 AM IST
Next Story