ఏసు వర్థంతే క్రిస్‌మస్ " మంత్రి ఆది ఆశ్చర్యకర వ్యాఖ్యలు
మంత్రి ఆదినారాయణరెడ్డి పప్పులో కాలేశారు. ఇప్పటికే అంబేద్కర్ జయంతి నాడు వర్థంతి శుభాకాంక్షలు చెప్పి మంత్రి నారా లోకేష్ నెటిజన్ల సెటైర్ల దాడిలో ఉక్కిరిబిక్కిరి అవగా…మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా అదే పనిచేశారు. కడప జిల్లా బద్వేల్‌లో మాజీ మంత్రి వీరారెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణరెడ్డి… క్రిస్‌మస్ గురించి తనకు తెలిసిన విషయాలు మాట్లాడారు. క్రిస్‌మస్‌ను ఏసు వర్ధంతి దినంగా ఆయన అభివర్ణించారు. ఏసు వర్ధంతినే క్రిస్‌మస్‌గా జరుపుకుంటారని చెప్పారు. అంతటితో ఆగకుండా మాజీ మంత్రి వీరారెడ్డి […]

మంత్రి ఆదినారాయణరెడ్డి పప్పులో కాలేశారు. ఇప్పటికే అంబేద్కర్ జయంతి నాడు వర్థంతి శుభాకాంక్షలు చెప్పి మంత్రి నారా లోకేష్ నెటిజన్ల సెటైర్ల దాడిలో ఉక్కిరిబిక్కిరి అవగా…మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా అదే పనిచేశారు.
కడప జిల్లా బద్వేల్‌లో మాజీ మంత్రి వీరారెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణరెడ్డి… క్రిస్‌మస్ గురించి తనకు తెలిసిన విషయాలు మాట్లాడారు. క్రిస్‌మస్‌ను ఏసు వర్ధంతి దినంగా ఆయన అభివర్ణించారు. ఏసు వర్ధంతినే క్రిస్‌మస్‌గా జరుపుకుంటారని చెప్పారు.
అంతటితో ఆగకుండా మాజీ మంత్రి వీరారెడ్డి వర్థంతి, ఏసు వర్థంతి ఒకటే రోజు అని చెప్పారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి ఏసు పుట్టిన రోజును క్రిస్‌మస్‌గా … ఏసు శిలువ ఎక్కిన రోజును గుడ్ ఫ్రైడేగా క్రిస్టియన్లు జరుపుకుంటారు.