Telugu Global
NEWS

ఐదుకు, పదికి కక్కుర్తి పడొద్దు.... పోలీసులకు చినరాజప్ప క్లాస్

ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసులకు క్లాస్‌ పీకారు. కాకినాడలో జరిగిన పోలీస్ ల అభినందన సభలో ప్రసంగించిన చినరాజప్ప… నిజాయితీగా బతకాలని పోలీసులకు సూచించారు. ఐదు, పది రూపాయలకు కక్కుర్తి పడితే గౌరవం ఉండదన్నారు. అలా చేయడం వల్ల డిపార్ట్‌మెంట్ పరువు తీసిన వారవుతారన్నారు. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, కబ్జాలు, ఇసుక దందాల్లోకి దిగవద్దని పోలీసులను కోరారు. ఒకడి బైక్ ఆపి వంద రూపాయలు వసూలు చేస్తే ఆ బైక్ వాడు పది మందికి దాన్ని ప్రచారం […]

ఐదుకు, పదికి కక్కుర్తి పడొద్దు.... పోలీసులకు చినరాజప్ప క్లాస్
X

ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసులకు క్లాస్‌ పీకారు. కాకినాడలో జరిగిన పోలీస్ ల అభినందన సభలో ప్రసంగించిన చినరాజప్ప… నిజాయితీగా బతకాలని పోలీసులకు సూచించారు.

ఐదు, పది రూపాయలకు కక్కుర్తి పడితే గౌరవం ఉండదన్నారు. అలా చేయడం వల్ల డిపార్ట్‌మెంట్ పరువు తీసిన వారవుతారన్నారు. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, కబ్జాలు, ఇసుక దందాల్లోకి దిగవద్దని పోలీసులను కోరారు.

ఒకడి బైక్ ఆపి వంద రూపాయలు వసూలు చేస్తే ఆ బైక్ వాడు పది మందికి దాన్ని ప్రచారం చేసి పరువు తీస్తాడని అభిప్రాయపడ్డారు. జీతాలు బాగా ఉన్నాయి కాబట్టి గౌరవంగా బతకాలన్నారు. వంద రూపాయలు వసూలు చేసినంత మాత్రాన మీ జీవితాలేమీ మారిపోవన్నారు. కాబట్టి నిజాయితీగా పనిచేస్తూ జీవించాలని పోలీసులకు హోంమంత్రి సూచించారు.

First Published:  25 Dec 2018 11:20 AM IST
Next Story