Telugu Global
International

 టీమిండియా " ఆసీస్ లకు డూ ఆర్ డై గా మెల్బోర్న్ టెస్ట్

మూడోటెస్ట్ నెగ్గిన జట్టుకే సిరీస్ పై పట్టు మూడోటెస్టుకు మూడు మార్పులతో టీమిండియా మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజాలకు చోటు టీమిండియా-ఆస్ట్రేలియాజట్ల టెస్ట్ సిరీస్ హాట్ హాట్ గా మారింది. మెల్బోర్న్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే మూడోటెస్ట్ మ్యాచ్….రెండుజట్లకూ డూ ఆర్ డై గా తయారయ్యింది. మొదటి రెండుమ్యాచ్ ల్లో..రెండుజట్లూ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో మూడోటెస్ట్ నిర్ణయాత్మకంగా మారింది. బాక్సింగ్ డే టెస్టుగా జరుగుతున్న ఈమ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో […]

 టీమిండియా  ఆసీస్ లకు డూ ఆర్ డై గా మెల్బోర్న్ టెస్ట్
X
  • మూడోటెస్ట్ నెగ్గిన జట్టుకే సిరీస్ పై పట్టు
  • మూడోటెస్టుకు మూడు మార్పులతో టీమిండియా
  • మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజాలకు చోటు

టీమిండియా-ఆస్ట్రేలియాజట్ల టెస్ట్ సిరీస్ హాట్ హాట్ గా మారింది. మెల్బోర్న్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే మూడోటెస్ట్ మ్యాచ్….రెండుజట్లకూ డూ ఆర్ డై గా తయారయ్యింది.

మొదటి రెండుమ్యాచ్ ల్లో..రెండుజట్లూ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో మూడోటెస్ట్ నిర్ణయాత్మకంగా మారింది. బాక్సింగ్ డే టెస్టుగా జరుగుతున్న ఈమ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో పోటీకి దిగుతుంటే.. ఆతిథ్య కంగారూ టీమ్ ఒకే ఒక్క మార్పుతో సమరానికి సై అంటోంది.

డూ ఆర్ డై ఫైట్….

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా, ఐదో ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్ల …నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్…నిర్ణయాత్మకదశకు చేరింది. అడిలైడ్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో టీమిండియా 31 పరుగులతో నెగ్గి 1-0 ఆధిక్యం సంపాదిస్తే…పెర్త్ వేదికగా జరిగిన రెండోటెస్టులో ఆసీస్ 146 పరుగుల భారీ తేడాతో టీమిండియాను కంగు తినిపించి 1-1తో సిరీస్ ను సమం చేయడంతో… ప్రస్తుత మూడోటెస్ట్… నిర్ణయాత్మకంగా మారింది.

విజయ్ – రాహుల్ జోడీ అవుట్….

కంగారూ గడ్డపై తొలిసారిగా సిరీస్ నెగ్గాలని కలలు కంటున్న టీమిండియా…ఆరునూరైనా మెల్బోర్న్ టెస్ట్ నెగ్గితీరాలన్న పట్టుదలతో … తుదిజట్టులో ఏకంగా మూడు మార్పులు చేపట్టింది.

గత రెండుటెస్టులు, నాలుగు ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైన ఓపెనింగ్ జోడీ…మురళీ విజయ్, కెఎల్ రాహుల్ ఇద్దరినీ టీమ్ మేనేజ్ మెంట్ పక్కన పెట్టింది.

తుది జట్టులో… కర్నాటక యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో పాటు…లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు కల్పించింది.

నయా ఓపెనర్లు మయాంక్-విహారీ….

అంతేకాదు..మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలను ఓపెనర్లుగా దించడానికి టీమ్ మేనేజ్ మెంట్ రంగం సిద్ధం చేసింది. ఆరో నంబర్ స్థానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ కు దిగబోతున్నాడు.

మరోవైపు…ఆతిథ్య కంగారూ జట్టు మాత్రం…వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న హ్యాండ్స్ కోంబ్ స్థానంలో….పేస్ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ కు తుదిజట్టులో చోటు కల్పించింది.

టీమిండియాకు మిక్సిడ్ రికార్డు….

ఇక…మెల్బోర్న్ వేదికగా టీమిండియా జయాపజయాల రికార్డును చూస్తే మిశ్రమఫలితాలే కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా… టీమిండియా ఇప్పటి వరకూ ఆడిన ఏడు బాక్సింగ్ డే టెస్టుల్లో …ఐదు పరాజయాలు, 2 డ్రాల రికార్డుతో ఉంది.

బాక్సింగ్ డే టెస్టులు కాకుండా…సాధారణ టెస్టుల్లో మాత్రం…టీమిండియాకు రెండు విజయాలు సాధించిన ఘనత ఉంది.

దశాబ్దాలుగా బాక్సింగ్ డే టెస్ట్….

క్రిస్మస్ మరుసటి రోజునే మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టును నిర్వహించడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే 2018 బాక్సింగ్ డే టెస్టుకు సైతం…. భారీసంఖ్యలో అభిమానులు హాజరుకాగలరని… క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది.

ఆట తొలిరోజున 60వేలకు పైగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ టెస్టు మ్యాచ్ లో నెగ్గిన జట్టుకే సిరీస్ పై పట్టు బిగించే అవకాశం ఉండడంతో… రెండుజట్లూ… విజయమేలక్ష్యంగా సమరానికి సై అంటున్నాయి.

బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజేతగా నిలువగలిగితే…ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లవుతుంది. బాక్సింగ్ డే టెస్టులో మొట్టమొదటి గెలుపుతో పాటు… సిరీస్ లో 2-1 ఆధిక్యం సాధించడంతో పాటు… నిలబెట్టుకొనే అవకాశం సైతం ఉంటుంది.

First Published:  25 Dec 2018 8:29 AM IST
Next Story