బాక్సింగ్ డే టెస్టులో దూకుడే ఆయుధమంటున్న రహానే
మూడంకెల స్కోరు వైపు అజింక్యా చూపు 2014 బాక్సింగ్ డే టెస్టులో అసాధారణంగా రాణించిన రహానే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజేతగా నిలవాలంటే…ఎదురుదాడిని మించిన ఆయుధం మరొకటి లేదని… వైస్ కెప్టెన్ అజింక్యా రహానే చెబుతున్నాడు. నాలుగేళ్ల క్రితం బాక్సింగ్ డే టెస్టులో అసాధారణంగా రాణించిన రహానే గత అనుభవాలను గుర్తు చేసుకొన్నాడు. దూకుడే మంత్రంగా…. ఆస్ట్రేలియా అంటే…దూకుడు…ఆస్ట్రేలియా అంటే ఎదురుదాడి. అలాంటి ఆసీస్ ను […]
- మూడంకెల స్కోరు వైపు అజింక్యా చూపు
- 2014 బాక్సింగ్ డే టెస్టులో అసాధారణంగా రాణించిన రహానే
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజేతగా నిలవాలంటే…ఎదురుదాడిని మించిన ఆయుధం మరొకటి లేదని… వైస్ కెప్టెన్ అజింక్యా రహానే చెబుతున్నాడు. నాలుగేళ్ల క్రితం బాక్సింగ్ డే టెస్టులో అసాధారణంగా రాణించిన రహానే గత అనుభవాలను గుర్తు చేసుకొన్నాడు.
దూకుడే మంత్రంగా….
ఆస్ట్రేలియా అంటే…దూకుడు…ఆస్ట్రేలియా అంటే ఎదురుదాడి. అలాంటి ఆసీస్ ను కంగారూ గడ్డపై…అదీ…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ స్టేడియంలో కంగు తినిపించాలంటే… ఎటాకింగ్ క్రికెట్ ను మించిన అస్త్రం మరొకటి లేదని….టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అంటున్నాడు.
2014 లో రహానే షో…..
నాలుగేళ్ల క్రితం మెల్బోర్న్ స్టేడియంలో వేలాదిమంది అభిమానుల సమక్షంలో తాను సాధించిన శతకాన్ని మరోసారి గుర్తు చేసుకొన్నాడు. 2014 బాక్సింగ్ డే టెస్టులో…ఓ స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ హోదాలో బరిలోకి దిగిన రహానే తొలిఇన్నింగ్స్ లో 147, రెండో ఇన్నింగ్స్ లో 48 పరుగుల స్కోర్లు సాధించాడు.
అంతేకాదు…ప్రస్తుత సిరీస్ లో భాగంగా ముగిసిన మొదటి రెండుటెస్టులు…నాలుగు ఇన్నింగ్స్ లో సైతం రహానే నిలకడగానే రాణిస్తూ వచ్చాడు. అడిలైడ్ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 13, రెండోఇన్నింగ్స్ లో 70 పరుగులు సాధించిన రహానే…పెర్త్ వేదికగా ముగిసిన రెండోటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 51, రెండోఇన్నింగ్స్ లో 30 పరుగుల స్కోర్లు నమోదు చేశాడు.
వైస్ కెప్టెన్ గా….
గత బాక్సింగ్ డే టెస్టులో సాధారణ బ్యాట్స్ మన్ గా పాల్గొన్న రహానే…నాలుగేళ్ల తర్వాత వైస్ కెప్టెన్ హోదాలో మరింత బాధ్యతతో బ్యాటింగ్ కు దిగబోతున్నాడు. ఇప్పటి వరకూ ఆడిన 54 టెస్టుల్లో 3వేల 435 పరుగులు సాధించిన రికార్డు రహానేకు ఉంది.
నాలుగు మ్యాచ్ ల ప్రస్తుత సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన మూడోటెస్టులో కెప్టెన్ విరాట్ కొహ్లీకి…వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సైతం స్థాయికి తగ్గట్టుగా ఆడటం ద్వారా…అండగా నిలిస్తే… కంగారూ జట్టుకు కష్టాలు తప్పవు కాక తప్పవు.