Telugu Global
National

మరింత భారం కానున్న కేబుల్‌ చార్జీలు

నిత్యం బిజీలైఫ్ గడిపే సామాన్యులకు, ఇంటి పనులతో అలిసి సొలసే గృహిణులకు కాస్త ఆహ్లాదాన్ని పంచేది టీవీలు. సీరియల్స్, సినిమాలతో పాటు క్రీడలు, వార్తలు వంటి వాటికి కూడా టీవీలపై ఆధారపడటం సాధారణం. అలాంటి టీవీ వీక్షణం ఇప్పుడు మరింత భారం కానుంది. కేవలం దూరదర్శన్ వంటి ఒకే ఛానల్ నుంచి వందల ఛానల్స్‌గా ఎదిగిన టీవీ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రజలకు పెనుభారంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో 100, 150 రూపాయల […]

మరింత భారం కానున్న కేబుల్‌ చార్జీలు
X

నిత్యం బిజీలైఫ్ గడిపే సామాన్యులకు, ఇంటి పనులతో అలిసి సొలసే గృహిణులకు కాస్త ఆహ్లాదాన్ని పంచేది టీవీలు. సీరియల్స్, సినిమాలతో పాటు క్రీడలు, వార్తలు వంటి వాటికి కూడా టీవీలపై ఆధారపడటం సాధారణం. అలాంటి టీవీ వీక్షణం ఇప్పుడు మరింత భారం కానుంది.

కేవలం దూరదర్శన్ వంటి ఒకే ఛానల్ నుంచి వందల ఛానల్స్‌గా ఎదిగిన టీవీ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రజలకు పెనుభారంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో 100, 150 రూపాయల వినోదం కాస్తా 800 వరకు చేరబోతోంది. ఇటీవల ట్రాయ్ తీసుకున్న నిర్ణయంతో డీటీహెచ్, ఎంఎస్‌వోలకు వరంగా మారింది. పే ఛానల్స్ ధరలను 19 రూపాయల వరకు పెంచుకునే వెసులుబాటు అందించింది. దీన్ని అవకాశంగా తీసుకొని పలు ప్రైవేట్ జాతీయ, ప్రాంతీయ ఛానల్స్ రేట్లను 4.50 రూపాయల నుంచి 19 వరకు పెంచేశాయి.

ట్రాయ్ నిబంధనల ప్రకారం 130 రూపాయల బేసిక్ ప్లాన్‌తో 100 ఫ్రీటూ ఎయిర్ ఛానల్స్‌ను ఇవ్వాలి. అయితే ప్రతీ రోజు మనం చూసే ఛానల్స్ అన్నీ పెయిడ్ ఛానల్సే. స్టార్ మా, జీ, జెమిని, ఈ టీవీ వంటివి పెయిడ్ ఛానల్స్. దీంతో వీటి కోసం తప్పని సరిగా అదనపు డబ్బు చెల్లించాలి.

జెమిని, స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్ విడివిడిగా 19 రూపాయలు చెల్లించాలి. ఈ టీవీ ఛానల్ కోసం 17 రూపాయలు చెల్లించాలి. అదే ప్యాకేజీ రూపంలో అయితే ఈ టీవీ గ్రూప్ ఛానల్స్ కోసం 24, స్టార్ మా ఛానెల్స్ కోసం 39, జీ ఛానల్స్ కోసం 20, జెమినీ ఛానల్స్ కోసం 20 చెల్లించాల్సి ఉంటుంది.

బేసిక్ ప్లాన్‌తో పాటు ఈ ఛానల్స్ అన్నీ తీసుకుంటే 237 రూపాయలు అవుతుంది. వీటికి అదనంగా నేషనల్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలంటే ఇంకా అధిక మొత్తం అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఛానల్స్ అన్నీ కావాలనుకుంటే 800 రూపాయల వరకు అవసరం అవుతుంది.

వినియోగదారుడికి మేలు చేయాల్సిన ట్రాయ్ వంటి సంస్థ కేబుల్, డీటీహెచ్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. అయితే రిలయన్స్ ఆధ్వర్యంలో తర్వలో వచ్చే జియో టీవీ ద్వారా ధరలు తగ్గే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. త్వరలో రానున్నరిలయన్స్‌ జియో టీవీకి మేలు చేకూర్చడం కోసమే ఇప్పుడు ఈ మార్పులు జరుగుతున్నాయని కొందరు విమర్శిస్తున్నారు.

First Published:  24 Dec 2018 12:53 AM GMT
Next Story