Telugu Global
NEWS

జనసేన గుర్తుకు గండికొట్టే గుర్తులు.... వాటిని తప్పించగలిగితే....

జనసేన పార్టీకి ఎన్నికల సంఘం టీ గాజు గ్లాసును గుర్తుగా కేటాయించింది. ఈ గుర్తు కేటాయించడంపై పవన్‌ కల్యాణ్‌ నుంచి ఆ పార్టీ కార్యకర్తల వరకూ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుర్తును సామాన్యుల్లోకి సులువుగా తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన అభిమానులు టీస్టాల్స్‌ దగ్గర టీ తాగి సెల్ఫీలు దిగుతూ గుర్తును ప్రచారం చేస్తున్నారు. అయితే టీ గ్లాసుకు దగ్గరగా పోలికలుండే గుర్తులు ఏవీ అన్నది కూడా గుర్తించే పనిలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో […]

జనసేన గుర్తుకు గండికొట్టే గుర్తులు.... వాటిని తప్పించగలిగితే....
X

జనసేన పార్టీకి ఎన్నికల సంఘం టీ గాజు గ్లాసును గుర్తుగా కేటాయించింది. ఈ గుర్తు కేటాయించడంపై పవన్‌ కల్యాణ్‌ నుంచి ఆ పార్టీ కార్యకర్తల వరకూ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుర్తును సామాన్యుల్లోకి సులువుగా తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన అభిమానులు టీస్టాల్స్‌ దగ్గర టీ తాగి సెల్ఫీలు దిగుతూ గుర్తును ప్రచారం చేస్తున్నారు. అయితే టీ గ్లాసుకు దగ్గరగా పోలికలుండే గుర్తులు ఏవీ అన్నది కూడా గుర్తించే పనిలో ఉన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు దగ్గరి పోలికలుండే ట్రక్కు గుర్తును పలువురు ఇండిపెండెంట్‌లకు ఈసీ కేటాయించింది. అలా ట్రక్కు గుర్తు మీద అభ్యర్థులు పోటీ చేసిన చోట టీఆర్‌ఎస్‌కు వేలాది ఓట్లు దారి మళ్లాయి.

గుర్తు విషయంలో గందరగోళానికి గురైన పలువురు కారుకు వేయబోయి ట్రక్కు గుర్తుకు ఓటేశారు. దీని వల్ల కొన్ని చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు.

ఈనేపథ్యంలో జనసేన ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అచ్చం టీ గ్లాసులాగే కనిపించే బకెట్, తబలా (డ్రమ్) గుర్తులు కూడా ఉన్నాయి.

ఒకవేళ ఎవరైనా ఇండిపెండెంట్‌లు బకెట్ గుర్తు లేదా తబలా గుర్తు తెచ్చుకుంటే దాని వల్ల జనసేనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

అందుకే వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు బకెట్ గుర్తు కేటాయించకుండా ఈసీకి విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని జనసేన నేతలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  24 Dec 2018 5:10 AM IST
Next Story