Telugu Global
National

నెటిజన్లను ఆశ్చర్యపరిచిన సుష్మ ట్వీట్!

భారత విదేశాంగ సహాయ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. విదేశాల్లో చిక్కుకున్న ఎంతో మంది భారతీయులకు ట్విటర్ ద్వారా పరిష్కారం చూపి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. కాస్త వెరైటీగా చేసిన ఈ ట్వీట్ కేవలం 638721నంబరు ఆమె అకౌంట్లో కనిపించింది. ఆ మెసేజ్ కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు మాత్రమే ఉంది. […]

భారత విదేశాంగ సహాయ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. విదేశాల్లో చిక్కుకున్న ఎంతో మంది భారతీయులకు ట్విటర్ ద్వారా పరిష్కారం చూపి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.

అయితే శనివారం మధ్యాహ్నం సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. కాస్త వెరైటీగా చేసిన ఈ ట్వీట్ కేవలం 638721నంబరు ఆమె అకౌంట్లో కనిపించింది. ఆ మెసేజ్ కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు మాత్రమే ఉంది. తర్వాత దాన్ని వెంటనే డిలీట్ చేశారు.

ఆ సమయంలో సుష్మా ఫాలోవర్లు దాని అర్థం ఏంటంటూ ఆలోచించే పనిలో పడ్డారు. అది ఒన్ టైమ్ పాస్ వర్డ్ అని కొందరు అభిప్రాయపడ్డాయి.

అయితే ఆ మెసేజ్ ను ఆమె ట్విటర్ కు చెందిన అంకుర సంస్థ క్లౌడ్ హోపర్ ద్వారా పోస్ట్ చేశారు. ఎస్ఎంఎస్ టెక్ట్స్ ను ఈ సాంకేతిక వేదిక ద్వారా సులభంగా ట్వీట్ గా మార్చవచ్చు. ఇది టెక్ట్స్‌ టు ట్వీట్ సర్వీస్‌. దాని ద్వారానే ఈ పొరపాటు జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ఆ గ్యాప్ లోనే కొందరు సుష్మా ట్వీట్ పై స్పందించారు. ఏదో ముఖ్యమైన విషయాన్ని రహస్య భాషలో చెప్పాలనుకుంటున్నారని కొందరు…. లేదు లేదు 2019 లోక సభ ఎన్నికల్లో 63,871ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మరికొందరు చమత్కరించారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించిన విషయం తెలిసిందే.

First Published:  22 Dec 2018 8:27 PM GMT
Next Story