తెలుగు తమ్ముళ్లకు తనదైన శైలిలో వర్మ థ్యాంక్స్
బాగా మండుతున్న నిప్పులో ఇంకాస్త పెట్రోల్ పోస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. వెన్నుపోటు సాంగ్ అంటూ ఓ పాట విడుదల చేసి, ఆ పాటపై చంద్రబాబు ఫొటోలు వాడాడు వర్మ. దీనిపై టీడీపీ భగ్గుమంటోంది. ఇప్పటికే కొందరు కోర్టు కేసులకు సిద్ధపడుతుండగా, మరికొందరు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. తనపై విరుచుకుపడుతున్న తెలుగు తమ్ముళ్లకు థ్యాంక్స్ చెప్పాడు. “నా ఫొటోల్ని తెలుగు తమ్ముళ్లు కాళ్ల కింద […]
బాగా మండుతున్న నిప్పులో ఇంకాస్త పెట్రోల్ పోస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. వెన్నుపోటు సాంగ్ అంటూ ఓ పాట విడుదల చేసి, ఆ పాటపై చంద్రబాబు ఫొటోలు వాడాడు వర్మ. దీనిపై టీడీపీ భగ్గుమంటోంది.
ఇప్పటికే కొందరు కోర్టు కేసులకు సిద్ధపడుతుండగా, మరికొందరు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. తనపై విరుచుకుపడుతున్న తెలుగు తమ్ముళ్లకు థ్యాంక్స్ చెప్పాడు.
“నా ఫొటోల్ని తెలుగు తమ్ముళ్లు కాళ్ల కింద వేసి తొక్కుతుంటే చాలా ఆనందంగా ఉంది. నన్ను పిచ్చోడు అనుకోని, వాళ్లు అంత టైం వేస్ట్ చేసుకొని అదంతా చేస్తున్నారు. వాళ్ల జీవితంలో ఉన్న విలువైన సమయాన్ని నాకోసం వెచ్చిస్తున్నారు. అది నాకు ఆనందంగా ఉంది. నేను నా సినిమాలు నేను తీసుకుంటున్నాను.”
కేసులు పెడితే భయపడనంటున్నాడు వర్మ. రివర్స్ లో తను కూడా కేసులు పెడతానని హెచ్చరిస్తున్నాడు. నిజాలు చెబుతున్నప్పుడు కేసులు పెడితే ఎందుకు నిలబడతాయని వాదిస్తున్నారు.
“కేసు పెడతా, కేసు పెడతా అని బెదిరిస్తున్నారు. అసలు కేసు ఎందుకు పెడతారు. ఏ ప్రాతిపదికన పెడతారు. నేను కూడా కేసులు పెడతాను. ఏమైనా అర్థముందా అందులో.”
తనపై విరుచుకుపడుతున్న తెలుగు తమ్ముళ్లను మొరిగే కుక్కలతో పోల్చారు ఆర్జీవి. అవి కరవవన్నారు. టీవీలో వార్నింగులకు భయపడేది లేదన్నారు.
“ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరయ్యే క్షణం నుంచి నా సినిమా స్టార్ట్ అవుతుంది. మూవీలో చంద్రబాబును విలన్ గా చూపించానా లేదా అనేది ఇప్పుడే నేను చెప్పలేను. నా టీవీ రౌడీస్ కు ఒకటే చెబుతున్నాను. నేను చేసేది చేస్తాను. మొరిగే కుక్కలు కరవవు. టీవీలో వార్నింగ్ ఇచ్చేవాళ్లను నేను కేర్ చేయను.”
ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా విడుదలైన వెంటనే తన సినిమా కూడా రిలీజ్ అవుతుందని, వాళ్లు ఏం చూపించబోతున్నారో తనకు తెలియదని, తను మాత్రం నిజాలే చూపిస్తానని అంటున్నాడు వర్మ.