Telugu Global
NEWS

గులాబీ అధిపతికి ప్రశంసల జల్లులు...!

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయాన్ని పండుగులా మార్చిన… సీఎం కేసీఆర్ ను దేశంలోని నాయకులంతా కొనియాడుతున్నారు. గులాబీ దళపతిని ఒకే రోజు ఇద్దరు కేంద్రమంత్రులు ప్రశంసలతో ముంచెత్తారు. దేశంలో రైతు రుణమాఫిని అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కితాబిచ్చారు. రైతునే రాజును చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ పథకాన్ని […]

గులాబీ అధిపతికి ప్రశంసల జల్లులు...!
X

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయాన్ని పండుగులా మార్చిన… సీఎం కేసీఆర్ ను దేశంలోని నాయకులంతా కొనియాడుతున్నారు. గులాబీ దళపతిని ఒకే రోజు ఇద్దరు కేంద్రమంత్రులు ప్రశంసలతో ముంచెత్తారు.

దేశంలో రైతు రుణమాఫిని అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కితాబిచ్చారు. రైతునే రాజును చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ పథకాన్ని దేశానికే దిక్సూచిలా చేశారు.

రైతు బంధు పథకం కింద ఎకరానికి 8వేల రూపాయలు పెట్టుబడిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమధ్య జరిగిన ఎన్నికల్లో ఎకరానికి పదివేల రూపాయలు పెట్టుబడి సాయం చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎకరానికి 5వేల చొప్పున పంట పెట్టుబడి చేయనున్నారు. ఈ పథకాన్ని జైట్లీ ప్రశంసించారు. తాజాగా ఒడిశా, జార్ఖాండ్ రాష్ట్రాలు రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకుని….తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు జైట్లీ. ఏడెనిమిది రాష్ట్రాలు రైతులకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ…. మాట నిలబెట్టుకోలేదన్నారు. పంజాబ్, కర్నాటక రాష్ట్రాలు రైతులకు రుణమాఫి చేయలేదని జైట్లీ వ్యాఖ్యానించారు.

First Published:  23 Dec 2018 1:54 AM IST
Next Story