Telugu Global
Health & Life Style

ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? మీకు గుండెపోటు ఖాయం!

చాలా మంది కుర్చీలకు ఫెవికాల్ అంటిపెట్టుకున్నట్లు కూర్చుంటారు. అంతే కాదు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోతుంటారు. మీరు కూడా గంటల తరబడి ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కూర్చుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు గంటల తరబడి కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికనట్లే. ఎక్కువ సేపు కూర్చున్నట్లయితే…. త్వరలో గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల స్థూలకాయం వస్తుందని ఇప్పటికే అధ్యయనాల్లో వెల్లడైంది. ఎక్కువగా కూర్చునట్లయితే […]

ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? మీకు గుండెపోటు ఖాయం!
X

చాలా మంది కుర్చీలకు ఫెవికాల్ అంటిపెట్టుకున్నట్లు కూర్చుంటారు. అంతే కాదు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోతుంటారు. మీరు కూడా గంటల తరబడి ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కూర్చుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.

మీరు గంటల తరబడి కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికనట్లే. ఎక్కువ సేపు కూర్చున్నట్లయితే…. త్వరలో గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల స్థూలకాయం వస్తుందని ఇప్పటికే అధ్యయనాల్లో వెల్లడైంది. ఎక్కువగా కూర్చునట్లయితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజాగా జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. లింగ, వయోభేదాలు లేకుండా ఎవరికైనా సరే… ఎక్కువ సమయం కూర్చుంటే…. గుండె జబ్బుల బారిన పడటం ఖాయమని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

45ఏళ్లు దాటిన 8వేల మందిని ఎంపిక చేసి… వారి జీవన శైలిని, శారీరక శ్రమను, వారి శరీరంలో వస్తున్న మార్పులను నాలుగు సంవత్సరాలపాటు శాస్త్రవేత్తలు పరిశీలించారు. అనంతరం గుండె సంబంధిత వ్యాధులపై జరిగిన అధ్యయనాలతో పోల్చారు.

45ఏళ్లు దాటిన వారిలో సరైన శారీర శ్రమలేక… గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయని భావించి… ఆపై వయస్సు వారిపైనే ఈ అధ్యయనం జరిపారు. ఒక రోజులో సగం కన్నా ఎక్కువ సమయం శారీరక శ్రమకు కేటాయించాలని అమెరికా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…..?

1. రోజూ సాధ్యమైనన్ని సార్లు శరీరానికి శ్రమను కల్పించాలి.

2. పనిచేసే చోట ఆఫీసైనా, ఇంట్లో అయినా అదే పనిగా కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నిలబడడం, నడవడం లాంటివి చేయాలి.

3. ఆఫీస్‌లో మంచినీళ్లు, టీ తాగాలంటే కుర్చీ వద్దకు తెప్పించుకోకుండా వాటి వద్దకు మనమే లేచి వెళ్లడం మంచిది.

4. ఆఫీసులో నలుగురితో లేదా పది మందితో మీటింగ్‌ ఉంటే కూర్చుని మాట్లాడకుండా నిలబడే మాట్లాడుకోవడం మంచిది.

5. సమీపంలో వున్న అనుబంధ ఆఫీసుకు లేదా మిత్రుడికి మెయిల్స్‌ పంపించకుండా స్వయంగా వెళ్లి సమాచారం అందించడం లాంటివి చేయాలి.

6. మధ్యాహ్నం భోజనం తెచ్చుకోకపోతే వీలైనంత దూరంలో ఉన్న హోటల్‌‌కు లేదా మెస్‌‌కు వెళ్లాలి.

7. భోజనం తెచ్చుకుంటే అనంతరం కాస్త దూరం నడవాలి.

8. ఇంట్లో మంచాలపై, సోఫాలపై ఎక్కువ సేపు కూర్చోకుండా వీలైనంత సేపు కింద నేలపైనే కూర్చోవాలి.

First Published:  23 Dec 2018 1:55 AM IST
Next Story