Telugu Global
NEWS

రాంగోపాల్ వర్మపై ఫిరాయింపు ఎమ్మెల్యే కేసు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబును కించపరిచేలా సినిమాను రూపొందిస్తున్నారంటూ వర్మపై ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా…. పోలీసులు కేసు నమోదు చేశారు. వర్మ వెనుక బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. వర్మను శిఖండిలా వాడుకుంటూ చేస్తున్న కుట్రలను బయటపెట్టాలని ఎస్వీ మోహన్ […]

రాంగోపాల్ వర్మపై ఫిరాయింపు ఎమ్మెల్యే కేసు
X

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబును కించపరిచేలా సినిమాను రూపొందిస్తున్నారంటూ వర్మపై ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా…. పోలీసులు కేసు నమోదు చేశారు.

వర్మ వెనుక బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. వర్మను శిఖండిలా వాడుకుంటూ చేస్తున్న కుట్రలను బయటపెట్టాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ వ్యతిరేకులు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు.

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన టీజర్ ను బాలకృష్ణ విడుదల చేయగానే దానికి పోటీగా వర్మ తను తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోంచి ‘వెన్నుపోటు’ అనే పాటను విడుదల చేశారు. ఇందులో చంద్రబాబును వెన్నుపోటు సన్నివేశాలను చూపించారు. స్వయంగా బాబు ఫొటోలు, వైస్రాయ్ లో చేసిన కుట్రకు సంబంధించిన వీడియోలను వర్మ చూపించారు. దీంతో టీడీపీ శిబిరం ఉలిక్కిపడింది. వర్మపై ఎదురుదాడికి సిద్ధమైంది..

తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాతావరణం వేడెక్కింది. కర్నూలులోనే కాదు.. ఏపీ వ్యాప్తంగా వర్మపై కేసులు పెట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. ఈ మేరకు పక్కాగా అన్ని చోట్ల ఫిర్యాదులు చేయాలని వర్మను ఇరుకున పెట్టాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.

First Published:  22 Dec 2018 12:00 PM IST
Next Story