లాంగ్ గ్యాప్ తర్వాత బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్
మొన్నటివరకు బిజిబిజీగా గడిపింది శృతిహాసన్. తమిళ్ లో చేసిన ఓ టీవీ సిరీస్ తో బిజీగా గడిపింది. అలా దాదాపు 3 నెలల పాటు బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సల్ ను మిస్ అయిన శృతిహాసన్… ఇప్పుడు మరోసారి అమెరికా చెక్కేసింది. బాయ్ ఫ్రెండ్ ను కలిసింది. ఇద్దరూ దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శృతిహాసన్. “నువ్వు నన్ను నవ్విస్తావు. ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం అదే.” అంటూ చిన్న క్యాప్షన్ […]
మొన్నటివరకు బిజిబిజీగా గడిపింది శృతిహాసన్. తమిళ్ లో చేసిన ఓ టీవీ సిరీస్ తో బిజీగా గడిపింది. అలా దాదాపు 3 నెలల పాటు బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సల్ ను మిస్ అయిన శృతిహాసన్… ఇప్పుడు మరోసారి అమెరికా చెక్కేసింది. బాయ్ ఫ్రెండ్ ను కలిసింది.
ఇద్దరూ దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శృతిహాసన్. “నువ్వు నన్ను నవ్విస్తావు. ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం అదే.” అంటూ చిన్న క్యాప్షన్ కూడా తగిలించింది. క్రిస్మస్ ను బాయ్ ఫ్రెండ్ తో కలిసి లాస్ ఏంజెల్స్ లో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించింది శృతిహాసన్. ఇక న్యూ ఇయర్ వేడుకల కోసం కూడా ఈ జంట ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది.
ప్రస్తుతం శృతి చేతిలో 2 సినిమాలే ఉన్నాయి. తండ్రి కమల్ తో చేస్తున్న శభాష్ నాయుడు వీటిలో ఒకటి. ఇది ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదు. దీంతో పాటు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ హిందీ సినిమా చేస్తోంది.