మిథాలీని కరుణించిన మహిళా సెలెక్షన్ కమిటీ
భారత మహిళా టీ-20 జట్టులో మిథాలీ రాజ్ జనవరి 24 నుంచి భారత మహిళలజట్టు న్యూజిలాండ్ పర్యటన న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ ల్లో భారత్ ఢీ ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో తన కెరియర్ ముగిసినట్లేనని భయపడుతూ వచ్చిన సీనియర్ ప్లేయర్ మిథాలీరాజ్ ను…మహిళా క్రికెట్ ఎంపిక సంఘం కరుణించింది. న్యూజిలాండ్ తో వచ్చేనెలలో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారత జట్టులో మిథాలీకి చోటు కల్పించింది. తమిళనాడుకు చెందిన డబ్లువీ […]
- భారత మహిళా టీ-20 జట్టులో మిథాలీ రాజ్
- జనవరి 24 నుంచి భారత మహిళలజట్టు న్యూజిలాండ్ పర్యటన
- న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ ల్లో భారత్ ఢీ
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో తన కెరియర్ ముగిసినట్లేనని భయపడుతూ వచ్చిన సీనియర్ ప్లేయర్ మిథాలీరాజ్ ను…మహిళా క్రికెట్ ఎంపిక సంఘం కరుణించింది. న్యూజిలాండ్ తో వచ్చేనెలలో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారత జట్టులో మిథాలీకి చోటు కల్పించింది.
తమిళనాడుకు చెందిన డబ్లువీ రామన్ మహిళా క్రికెట్ కోచ్ గా ఎంపికైన కొద్దిగంటల్లోనే… న్యూజిలాండ్ లో పర్యటించే 15 మంది సభ్యుల భారత మహిళా క్రికెట్ వన్డే, టీ-20 జట్లను బీసీసీఐ ప్రకటించింది.
డబ్లువీ రామన్ సరికొత్త కోచ్ గా ఎంపిక కావడంతోనే…జనవరి 24 నుంచి న్యూజిలాండ్ లో పర్యటించే వన్డే జట్టు కెప్టెన్ గా మిథాలీరాజ్ ను, టీ-20 జట్టు సారథిగా హర్మన్ ప్రీత్ కౌర్ ను కొనసాగించాలని నిర్ణయించింది.
భారత మహిళా జట్టు తన పర్యటన కాలంలో న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల వన్డే, టీ-20 సిరీస్ ల్లో తలపడనుంది. మొత్తం 15 మంది సభ్యుల భారత వన్డే జట్టులో వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామికి సైతం చోటు కల్పించారు.
2018 టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఓటమి తర్వాత…భారత మహిళా జట్టు… న్యూజిలాండ్ లో పర్యటించబోవడం ఇదే మొదటిసారి.