Telugu Global
NEWS

జగన్‌ పుట్టిన రోజు ర్యాలీ వద్ద లగడపాటి.... ఏం చేశారంటే....

కృష్ణాజిల్లా విసన్నపేటలో వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే రక్షణనిధి ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రక్షణనిధి ర్యాలీగా వెళ్తున్న సమయంలో అటుగా వెళ్తున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎదురుపడ్డారు. ర్యాలీ వద్దకు వచ్చిన లగడపాటి … వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిని ఆలింగం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలని రక్షణనిధిని లగడపాటి అభినందించారు. కష్టపడితే ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు. కాసేపు […]

జగన్‌ పుట్టిన రోజు ర్యాలీ వద్ద లగడపాటి.... ఏం చేశారంటే....
X

కృష్ణాజిల్లా విసన్నపేటలో వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే రక్షణనిధి ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ చేశారు.

ఈ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రక్షణనిధి ర్యాలీగా వెళ్తున్న సమయంలో అటుగా వెళ్తున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎదురుపడ్డారు.

ర్యాలీ వద్దకు వచ్చిన లగడపాటి … వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిని ఆలింగం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలని రక్షణనిధిని లగడపాటి అభినందించారు. కష్టపడితే ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు.

కాసేపు ఎమ్మెల్యేతో లగడపాటి చిట్ చాట్ చేశారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేయగా… లగడపాటి నవ్వుతూ వెళ్లిపోయారు.

First Published:  21 Dec 2018 2:16 PM IST
Next Story