Telugu Global
NEWS

ఈనెల 23న ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 23న ఏపీకి రానున్నారు. ఆయన విశాఖ రాబోతున్నారు. శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకునేందుకు కేసీఆర్‌ వస్తున్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌తో రాజసూయ యాగాన్ని స్వరూపానందేంద్ర చేయించారు. ఇప్పుడు తిరిగి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కేసీఆర్‌ విశాఖ శారదా పీఠానికి వస్తున్నారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్న తర్వాత విశాఖ నుంచి భువనేశ్వర్‌కు కేసీఆర్‌ వెళ్తారు. భుననేశ్వర్‌లో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశం అవుతారు. ఫెడరల్ ఫ్రంట్‌ గురించి నవీన్‌తో కేసీఆర్ […]

ఈనెల 23న ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్‌
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 23న ఏపీకి రానున్నారు. ఆయన విశాఖ రాబోతున్నారు. శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకునేందుకు కేసీఆర్‌ వస్తున్నారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్‌తో రాజసూయ యాగాన్ని స్వరూపానందేంద్ర చేయించారు. ఇప్పుడు తిరిగి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కేసీఆర్‌ విశాఖ శారదా పీఠానికి వస్తున్నారు.

స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్న తర్వాత విశాఖ నుంచి భువనేశ్వర్‌కు కేసీఆర్‌ వెళ్తారు. భుననేశ్వర్‌లో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశం అవుతారు.

ఫెడరల్ ఫ్రంట్‌ గురించి నవీన్‌తో కేసీఆర్ చర్చిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఏపీకి వచ్చిన సమయంలో టీడీపీ మంత్రులు దగ్గరుండి స్వాగతం పలికారు. ఈసారి విశాఖ వస్తున్న కేసీఆర్‌కు ఏపీ మంత్రులు స్వాగతం పలుకుతారో లేదో చూడాలి.

First Published:  21 Dec 2018 6:20 AM IST
Next Story