అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న అగ్రిగోల్డ్ అంశంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పెద్దలు, యాజమాన్యం కలిసి ఆస్తుల విక్రయం విషయంలో దోబూచులాట ఆడుతుండడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ కేసులో కీలకమైన హాయ్‌ల్యాండ్ వేలానికి హైకోర్టు ఆదేశించింది. నారా లోకేష్ హాయ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్న వేళ హైకోర్టు నేరుగా స్పందించింది. హాయ్‌ల్యాండ్ కనీస ధరను 600 కోట్లుగా నిర్ణయించిన హైకోర్టు…. సీల్డ్ కవర్‌లో బిడ్లను ఆహ్వానించాలని […]
లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న అగ్రిగోల్డ్ అంశంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పెద్దలు, యాజమాన్యం కలిసి ఆస్తుల విక్రయం విషయంలో దోబూచులాట ఆడుతుండడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అగ్రిగోల్డ్ కేసులో కీలకమైన హాయ్‌ల్యాండ్ వేలానికి హైకోర్టు ఆదేశించింది. నారా లోకేష్ హాయ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్న వేళ హైకోర్టు నేరుగా స్పందించింది. హాయ్‌ల్యాండ్ కనీస ధరను 600 కోట్లుగా నిర్ణయించిన హైకోర్టు…. సీల్డ్ కవర్‌లో బిడ్లను ఆహ్వానించాలని ఆదేశించింది.
హాయ్‌ల్యాండ్ విలువ రూ. 800 కోట్లు ఉంటుందని యాజమాన్యం తెలపడంతో హైకోర్టు దాని కనీస ధరను రూ.600కోట్లుగా నిర్ణయించి వేలం వేయాల్సిందిగా ఆదేశించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న హైకోర్టు హాల్‌లోనే బిడ్లను ఓపెన్ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. వెయ్యి కోట్లకు బిడ్ తీసుకురావాలని అప్పుడే నిందితుల బెయిల్ పిటిషన్లను పరిశీలిస్తామని తేల్చేసింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.