Telugu Global
National

రైతుల ఆత్మహత్యల సమాచారం కేంద్రం వద్ద లేదట

దేశంలోని రైతులు ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఒక వైపు పంట పెట్టుబడి నానాటికీ పెరిగిపోతుంటే…. మరోవైపు పంటకు సరైన గిట్టుబాటు ధర రాక నష్టాల పాలవుతున్నారు. పంట కోసం చేసిన అప్పులు పెరిగిపోయి… తుపాన్లు, ఇతర కారణాల వల్ల నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇండియాలో జరిగే ఆత్మహత్యల్లో 11.7 శాతం రైతుల ఆత్మహత్యలే అని ఒక అధ్యయనం తేల్చింది. అసలు మన దేశంలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే ప్రశ్నకు…. గత మూడేళ్ల […]

రైతుల ఆత్మహత్యల సమాచారం కేంద్రం వద్ద లేదట
X

దేశంలోని రైతులు ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఒక వైపు పంట పెట్టుబడి నానాటికీ పెరిగిపోతుంటే…. మరోవైపు పంటకు సరైన గిట్టుబాటు ధర రాక నష్టాల పాలవుతున్నారు. పంట కోసం చేసిన అప్పులు పెరిగిపోయి… తుపాన్లు, ఇతర కారణాల వల్ల నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఇండియాలో జరిగే ఆత్మహత్యల్లో 11.7 శాతం రైతుల ఆత్మహత్యలే అని ఒక అధ్యయనం తేల్చింది. అసలు మన దేశంలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే ప్రశ్నకు…. గత మూడేళ్ల నుంచి సమాచారం తమ వద్ద లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ నిన్న పార్లమెంటుకు తెలియజేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తుందని…. అయితే గత మూడేళ్లుగా (2016 నుంచి) రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన డేటా ఏదీ వెలువడ లేదని ఆయన చెప్పడం గమనార్హం.

2016 నుంచి ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందిన సహాయం ఏమిటంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేశ్ త్రివేది పార్లమెంటులో ప్రశ్నించారు. దీనికి మంత్రి పై విధంగా సమాధానం ఇచ్చారు. 2015 వరకు మాత్రమే లెక్కలు ఉన్నాయని, ఆ తర్వాత ఎలాంటి గణాంకాలు వెల్లడించలేదని మంత్రి లిఖిత పూర్వకంగా చెప్పారు. అయితే దేశంలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని…. దానికి ప్రభుత్వం నుంచి పలు రకాలుగా సాయం అందుతోందన్నారు.

ఇక ఈ విషయంపై వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హోంశాఖ పరిధిలో పని చేసే నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రతీ ఏటా ఒక డేటాను ప్రచురిస్తుంది. ‘భారత దేశంలో ఆకస్మిక మరణాలు, ఆత్మహత్యలు’ పేరిట ప్రచురించే ఈ డేటాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లెక్కలు తెప్పించి ప్రచురిస్తుంది. కాని దేశంలో చివరి సారిగా 2015లో మాత్రమే ఈ గణాంకాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఎలాంటి లెక్కా పత్రాలు లేవు.

మోడీ హయాంలో జరిగిన పలు ఆందోళనలు, ఉద్యమాల సమయాల్లో పలువురు రైతులు మరణించిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది మాందసార్‌లో ఐదుగురు రైతులు పోలీసులు కాల్పుల్లో మరణించారు. ఆ లెక్క తప్ప ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు మాత్రం ఇంత వరకు పొందు పరచలేదు. అయితే ఇదే విషయాన్ని హోం శాఖ దృష్టికి తీసుకు వెళ్లగా…. ప్రస్తుతం 2016కు సంబంధించిన రిపోర్టు పరిశీలన జరుగుతుందని త్వరలోనే వెల్లడిస్తామని చెబుతున్నారు.

First Published:  20 Dec 2018 8:15 PM GMT
Next Story