"అంతరిక్షం" సినిమా రివ్యూ
రివ్యూ: అంతరిక్షం రేటింగ్: 2.75/5 తారాగణం: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి, అదితి రావు హైదరి తదితరులు సంగీతం: ప్రశాంత్ విహారి నిర్మాత: క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, మురళి దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి గత ఏడాది “ఫిదా” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న వరుణ్ తేజ్ ఈ ఏడాది “తొలిప్రేమ” సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇదే ఊపు లో “అంతరిక్షం” అనే సినిమాలో నటించాడు వరుణ్ తేజ్. “ఘాజీ” ఫేం సంకల్ప్ […]
రివ్యూ: అంతరిక్షం
రేటింగ్: 2.75/5
తారాగణం: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి, అదితి రావు హైదరి తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
నిర్మాత: క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, మురళి
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
గత ఏడాది “ఫిదా” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న వరుణ్ తేజ్ ఈ ఏడాది “తొలిప్రేమ” సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇదే ఊపు లో “అంతరిక్షం” అనే సినిమాలో నటించాడు వరుణ్ తేజ్. “ఘాజీ” ఫేం సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగు లో మొదటి సారి వస్తున్న స్పేస్ ఫిలిం గా ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. లావణ్య త్రిపాటి, అదితి రావు హైదరి హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాని క్రిష్ ప్రొడ్యూస్ చేసాడు.
దేవ్ (వరుణ్ తేజ్) ఒక శిక్షణ పొందిన వ్యోమగామి. తను సొంతంగా తయారు చేసిన విప్రయన్ అనే శ్యాటిలైట్ ని మూన్ మీదకి పంపించాలి అనే ప్రయత్నం చేసి విఫలం అవుతాడు. ఈ క్రమంలో దేవ్ తన లైఫ్ ని ఎంతో కోల్పోతాడు. ఇక కాల క్రమంలో దేవ్ కి అయిదేళ్ళ తరువాత విప్రయన్ ని ఫిక్స్ చేసే ఛాన్స్ వస్తుంది. మరి ఈ సారి దేవ్ సక్సెస్ అయ్యాడా లేదా? అసలు అంతరిక్షం లో దేవ్, ఇంకా అతని టీం ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అనేది మిగిలిన కథ.
వరుణ్ తేజ్ ఈ సినిమాకి ఆయువు పట్టులాంటి వాడు. ఎందుకంటే వ్యోమగామి పాత్రలో వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సినిమా మొత్తం ఒకే టెంపో లో నటిస్తూ కథని ముందుకి తీసుకొని వెళ్ళడం లో తోడయ్యాడు వరుణ్ తేజ్. తన పాత్ర ఎదుర్కొనే ఛాలెంజ్ ని చాలా ఈజ్ తో చేసేసాడు వరుణ్ తేజ్.
ఇక వరుణ్ తేజ్ తరువాత మాట్లడుకోవాల్సింది బాలీవుడ్ భామ అదితి రావు హైదరి గురించి.
ఈ భామ కూడా వరుణ్ తేజ్ కి గట్టి పోటీని ఇస్తూ బాగానే నటించింది. ఇక సినిమాలో లావణ్య త్రిపాటి పాత్రే తక్కువే ఉన్న కూడా పర్వాలేదు అనిపించింది. ఇక స్పేస్ సెంటర్ హెడ్ గా రహమాన్ బాగా చేసాడు. రహమాన్ కి ఇంకా వరుణ్ తేజ్ కి మధ్యలో వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే సత్య దేవ్, అవసరాల శ్రీనివాస్ తమ పాత్రల మేరకు పర్వాలేదు అనిపించారు.
ముందుగా కేవలం అతి తక్కువ టైం లో తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాని తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి ని మెచ్చుకోవాలి. “ఘాజి” లాంటి హిట్ తరువాత కూడా సంకల్ప్ రెడ్డి “అంతరిక్షం” లాంటి సినిమా తీయడం నిజంగా సాహసమే అని చెప్పాలి.
ఇక పొతే కథ సింపుల్ గా రాసుకున్న సంకల్ప్ రెడ్డి కథనం ప్రకారమే ఎమోషన్స్ ని పండించాడు. గ్రాఫిక్స్ వర్క్ ని కూడా సంకల్ప్ రెడ్డి బాగా హ్యాండిల్ చేసాడు. ప్రశాంత్ విహారి సంగీతం బాగుంది. అలాగే జ్ఞానశేఖర్ అందించిన కెమెరా పనితనం బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
డైరెక్టర్ ప్రతిభ,
వరుణ్ తేజ్,
కథ,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్,
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్,
ప్రేక్షకులు అంచనా వేయగలిగే కథనం
చివరి మాట:
“ఘాజీ” సినిమా పూర్తీ గా నీటి అడుగున తీసి హిట్ అందుకున్న సంకల్ప్ రెడ్డి ఈ సినిమాని పూర్తీ గా స్పేస్ లో తీసి ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేసాడు. సంకల్ప్ రెడ్డి ప్రయత్నం అలాగే పనితనం కోసం ఈ సినిమాని చూడొచ్చు.
- Aditi Rao HydariAndhra Politicsandhra pradesh district newsandhra pradesh politicsantariksham 9000 kmph movieAntariksham 9000 KMPH movie reviewBJPcelebrity newscomedy newsCONgressDharma Productions Sradvn productionsdownloaddownload Antariksham 9000 KMPH movie reviewEnglish national newsenglish news portalsent onlineEntertainentertainment comentertainment full movieentertainment newsentertainment websitesentertainment weeklyet entertainmentet newset onlinefilm newsGenral newshistory newsInternational newsInternational telugu newsLavanya Tripathimovie newsMovie news telugumovie updatessNational newsNational PoliticsNational telugu newsnews entertainmentpolitical news teluguPrashanth VihariPublic newsreviewSankalp ReddySatyadev KancharanaTDPtelangana district newsTelangana PoliticsTelugutelugu cinema newsTelugu Comedytelugu comedy newstelugu crimetelugu crime newstelugu crimestelugu global crime newstelugu global english news portaltelugu global newstelugu global news portaltelugu global telugu news portaltelugu historical newstelugu historical placestelugu historytelugu history newsTelugu international newsTelugu movie newsTelugu Movie ReviewsTelugu national newsTelugu Newstelugu news upatestelugu normal newsTelugu political newstelugu political partiestelugu politicstelugu politics newstelugu rajakiyaluteluguglobal.comteluguglobal.inTollywoodtollywood latest newstollywood movie newsTollywood Movie Reviewstollywood newsTRSVarun Tejweekly entertaiment