Telugu Global
National

ఆధార్‌లో తండ్రి, భర్త పేర్లు తొలగింపు.... కారణం ఇదే

ఆధార్ కార్డుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించాక పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మొబైల్ నెంబర్‌కు ఆధార్ తప్పని సరి కాదని.. అవసరమైతే ఆ డేటాను వినియోగదారుడు ఉపసంహరించుకునే వెసులు బాటు కల్పించాలని ‘ఉడాయ్’ నిర్ణయించింది. అంతే కాకుండా బ్యాంకు నెంబర్‌కు కూడా ఆధార్ తప్పని సరి కాదని చెప్పింది. ఆధార్ విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్న ‘ఉడాయ్’ తాజాగా మరో ప్రతిపాదన చేయనుంది. ఆధార్ కార్డులో బంధుత్వాన్ని సూచించే పదాలను తీసేయాలని.. కేవలం […]

ఆధార్‌లో తండ్రి, భర్త పేర్లు తొలగింపు.... కారణం ఇదే
X

ఆధార్ కార్డుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించాక పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మొబైల్ నెంబర్‌కు ఆధార్ తప్పని సరి కాదని.. అవసరమైతే ఆ డేటాను వినియోగదారుడు ఉపసంహరించుకునే వెసులు బాటు కల్పించాలని ‘ఉడాయ్’ నిర్ణయించింది. అంతే కాకుండా బ్యాంకు నెంబర్‌కు కూడా ఆధార్ తప్పని సరి కాదని చెప్పింది.

ఆధార్ విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్న ‘ఉడాయ్’ తాజాగా మరో ప్రతిపాదన చేయనుంది. ఆధార్ కార్డులో బంధుత్వాన్ని సూచించే పదాలను తీసేయాలని.. కేవలం కేరాఫ్ అని మాత్రమే ఉంచాలని నిర్ణయించింది. భర్త పేరు, తండ్రిపేరు ఉండటం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తున్నట్లు గుర్తించింది.

ఆధార్ కార్డులో ఉండే సన్నాఫ్, డాటరాఫ్, వైఫ్ ఆఫ్ వంటివి ఉండటం వల్ల ఆస్తి తగాదాలు, వారసత్వ తగాదాలు కోర్టులకు వెళ్లినప్పుడు ఆధార్‌ను చూపిస్తున్నారని…. ఇది ఆధార్ సంస్థకు చిక్కు తెచ్చిపెడుతుండటంతో ఉడాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం కేరాఫ్ అని మాత్రమే పేర్కొంటారు. ఇప్పటి వరకు జారీ అయిన ఆధార్‌లో కూడా మార్పులు చేస్తారని…. ఇకపై పాత వాళ్లు కొత్తగా డౌన్‌లోడ్ చేస్తే కేవలం కేరాఫ్ అని మాత్రమే వస్తుందని అధికారులు చెబుతున్నారు.

First Published:  21 Dec 2018 3:56 AM GMT
Next Story