Telugu Global
National

ఏ కంప్యూటర్‌నైనా తనిఖీ చేయవచ్చు.... దర్యాప్తు సంస్థలకు అధికారాలు....

ఇంట్లోనే ఎవరూ చూడరు కదా అని కంప్యూటర్‌ని రకరకాలుగా ఉపయోగించే వాళ్లు ఉన్నారు. కొంత మంది యువత ఏకంగా సైబర్ క్రైమ్స్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. మన సిస్టంను ఎవరు గమనిస్తారు…. అవసరమైతే ‘ఇంకాగ్నిటో’ మోడ్‌లో పెట్టుకుంటా…. అవసరమైతే బ్లాక్ బ్రౌజర్స్ యూజ్ చేస్తా అనుకుంటూ ఉంటారు. ఇకపై ఇలాంటి ఆటలు చెల్లవు. దేశంలో సైబర్ క్రైం… ముఖ్యంగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్, లైంగిక వేధింపులు, తీవ్రవాద సంస్థలతో సంభాషణలు జరపడం వంటివి పెరిగి […]

ఏ కంప్యూటర్‌నైనా తనిఖీ చేయవచ్చు.... దర్యాప్తు సంస్థలకు అధికారాలు....
X

ఇంట్లోనే ఎవరూ చూడరు కదా అని కంప్యూటర్‌ని రకరకాలుగా ఉపయోగించే వాళ్లు ఉన్నారు. కొంత మంది యువత ఏకంగా సైబర్ క్రైమ్స్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. మన సిస్టంను ఎవరు గమనిస్తారు…. అవసరమైతే ‘ఇంకాగ్నిటో’ మోడ్‌లో పెట్టుకుంటా…. అవసరమైతే బ్లాక్ బ్రౌజర్స్ యూజ్ చేస్తా అనుకుంటూ ఉంటారు.

ఇకపై ఇలాంటి ఆటలు చెల్లవు. దేశంలో సైబర్ క్రైం… ముఖ్యంగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్, లైంగిక వేధింపులు, తీవ్రవాద సంస్థలతో సంభాషణలు జరపడం వంటివి పెరిగి పోతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.

ఇకపై దేశంలోని ప్రతీ కంప్యూటర్‌పై నిఘా వేసేందుకు పది కేంద్ర దర్యాప్తు సంస్థలకు అనుమతి ఇచ్చింది. సదరు సంస్థలు వాటికి అనుమానం వచ్చిన లేదా ర్యాండమ్ చెకింగ్‌లో భాగంగా ఏ కంప్యూటర్‌ను అయినా రిమోట్ పద్దతిలో చెక్ చేసే అవకాశం కలుగుతుంది.

ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌, సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్‌, డైర‌క్ట‌రేట్ ఆఫ్ రెవ‌న్యూ ఇంటెలిజెన్స్‌, సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌, నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ, క్యాబినెట్ సెక్ర‌ట‌రియేట్‌, ఆర్ అండ్ ఏ డ‌బ్ల్యూ, డైర‌క్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్‌, ఢిల్లీ పోలీసుల‌కు ఈ ప్రత్యేక అధికారం లభించింది.

ఈ సంస్థలు ఏ సమయంలో అయినా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన సమాచారం, సదరు వ్యక్తికి…. వచ్చి,పోయే మెసేజెస్, మెయిల్స్ చదివే అధికారం ఆ సంస్థలకు ఇచ్చారు. దీనికి ఆ కంప్యూటర్ యజమానితో పాటు సర్వీస్ ప్రొవైడర్ తప్పక సహకరించాల్సి ఉంటుంది.

ఈ సంస్థల దర్యాప్తునకు కంప్యూటర్ యజమాని, సర్వీస్ ప్రొవైడర్ సహకరించకుంటే వారికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమాన విధిస్తారు. దీనికి సంబంధించి ఐటీ చట్టంలోని సెక్షన్ 69(1) కింద మార్గదర్శకాలు విడుదల చేస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

First Published:  21 Dec 2018 3:59 AM GMT
Next Story