Telugu Global
NEWS

ఆ గుర్తులు తెలంగాణ ఎన్నికల్లో వద్దు....

తెలంగాణ ఎన్నికల్లో కారు జోరుకు హస్తం కుదేలయ్యింది. టీఆర్ఎస్ ను అడ్డుకునే శక్తే కనిపించలేదు. కానీ ఒక చిన్న పార్టీ… ఆ పార్టీ గుర్తులు, కొందరు స్వతంత్రులు టీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశారు. మాజీ చీఫ్ విప్, ధర్మపురి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ను దాదాపు ఓటమి అంచున నిలబెట్టారు.. కొప్పుల కేవలం 441ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. ఇక్కడ కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు […]

ఆ గుర్తులు తెలంగాణ ఎన్నికల్లో వద్దు....
X

తెలంగాణ ఎన్నికల్లో కారు జోరుకు హస్తం కుదేలయ్యింది. టీఆర్ఎస్ ను అడ్డుకునే శక్తే కనిపించలేదు. కానీ ఒక చిన్న పార్టీ… ఆ పార్టీ గుర్తులు, కొందరు స్వతంత్రులు టీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశారు. మాజీ చీఫ్ విప్, ధర్మపురి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ను దాదాపు ఓటమి అంచున నిలబెట్టారు.. కొప్పుల కేవలం 441ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. ఇక్కడ కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు అభ్యర్థి 13వేల ఓట్లు సాధించడం విశేషం. కారు అనుకొని చాలా మంది ట్రక్కు గుర్తుకు ఓటు వేయడంతో ఈ పరిస్థితి వచ్చింది.

ఇక నకిరేకల్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి 85వేల ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 93వేల ఓట్లు వచ్చాయి. ట్రక్కు గుర్తు అభ్యర్థికి 10వేల ఓట్లు వచ్చాయి. ఈ పదివేల ఓట్లు కలుపుకుంటే నకిరేకల్ లో టీఆర్ఎస్ గెలిచేదే.. ఇలా చాలామంది టీఆర్ఎస్ అభ్యర్థులకు చుక్కలు చూపించిన ట్రక్కు గుర్తు సహా కారును పోలిన గుర్తులను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో…. ఆ గుర్తులను తెలంగాణ ఎన్నికల్లో కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్లమెంటరీ బృందం కోరుతోంది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు, కెమెరా, ఇస్త్రీ పెట్టె, టోపి గుర్తులను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అభ్యర్థులెవరికీ కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఉదయం కలిసి కోరారు. కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోరాను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తుల వల్ల కలిగిన నష్టాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో వీటిని ఎవరికీ కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు ఎంపీ జితేందర్ రెడ్డి ఢిల్లీలో విలేకరులకు తెలిపారు.

ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ కు కేంద్ర ఎన్నికల సంఘం ట్రక్కు గుర్తును కేటాయించిందని… దానివల్ల ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నష్టం జరిగిందని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. పోయినసారి ఆటో, హ్యాటు వల్ల కలిగిన నష్టంతో ఈసారి వాటిని కేటాయించలేదని.. అదే విధంగా ఈసారి ఇస్త్రీ పెట్టే, ట్రక్కు, కెమెరాలను కూడా తీసివేయాలని కోరామని…. తప్పకుండా న్యాయం చేస్తామని చీఫ్ కమిషనర్ హామీ ఇచ్చినట్టు జితేందర్ రెడ్డి తెలిపారు.

First Published:  20 Dec 2018 1:55 AM GMT
Next Story