Telugu Global
NEWS

నాకు అన్నం కూడా పెట్టలేదు " సుజనాచౌదరి సంచలన ఆరోపణలు

మాజీ కేంద్రమంత్రి, టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి ఆరువేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఇటీవల ఈడీ అధికారులు సుజనాచౌదరి నివాసాలు, ఆఫీసులపై దాడి చేశారు. పలు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్మును సుజనా చౌదరి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టకుండా దారి మళ్లించారు. దీంతో బ్యాంకులు అప్పు కింద రికవరీ చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. తప్పుడు […]

నాకు అన్నం కూడా పెట్టలేదు  సుజనాచౌదరి సంచలన ఆరోపణలు
X

మాజీ కేంద్రమంత్రి, టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి ఆరువేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఇటీవల ఈడీ అధికారులు సుజనాచౌదరి నివాసాలు, ఆఫీసులపై దాడి చేశారు. పలు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్మును సుజనా చౌదరి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టకుండా దారి మళ్లించారు. దీంతో బ్యాంకులు అప్పు కింద రికవరీ చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. తప్పుడు పత్రాలతో అప్పులు తీసుకుని బ్యాంకులను ముంచినందుకు గాను… గతంలోనే సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇటీవల ఈడీ కూడా రంగంలోకి దిగి దాడులు చేసింది. దాడుల అనంతరం నోటీసులు జారీ చేసి సుజనా చౌదరిని విచారించింది.

ఈ నేపథ్యంలో ఈడీ అధికారులకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో సుజనా చౌదరి వాదన వినిపించారు. ఈడీ అధికారులు విచారణ సందర్భంగా తనను చాలా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. భోజన విరామ సమయంలో ఆహారం కూడా అందించలేదని కోర్టుకు వివరించారు. భోజనం అడిగినా ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారని చెప్పారు.

ఇలా రెండు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టారని, సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. ఒకవేళ సుజనా చౌదరికి అన్నం పెట్టకపోయి ఉంటే అది మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

సుజనాచౌదరి ఆరోపణలను ఈడీ న్యాయవాది కొట్టివేశారు. భోజనాన్ని ఈడీ అధికారులు ఏర్పాటు చేశారని…కానీ సుజనాచౌదరే తీసుకోలేదని…ఒక అరటి పండు మాత్రమే తిన్నారని వివరించారు. ఈడీ అధికారులు తనకు అన్నం పెట్టలేదన్న ఆరోపణలకు కట్టుబడి ఉంటానని అందుకు అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమని సుజనాచౌదరి చెప్పారు. అందుకు అనుమతించిన కోర్టు… సుజనాచౌదరి అఫిడవిట్‌కు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఈడీ న్యాయవాదికి సూచించింది.

First Published:  20 Dec 2018 5:11 AM IST
Next Story