Telugu Global
Cinema & Entertainment

కొత్త హీరోయిన్ నీ సెట్ చేసిన శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల ……ఈ పేరు వినగానే అందరికి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. శేఖర్ కమ్ముల సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. అలాంటి శేఖర్ కమ్ముల గత ఏడాది “ఫిదా” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తన సక్సెస్ రేట్ ని పెంచుకున్నాడు. ఆ రేంజ్ హిట్ అందుకున్నప్పటికి ఇప్పటి వరకు తన తదుపరి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చెయ్యలేదు శేఖర్ కమ్ముల. ఇకపోతే ప్రస్తుతం ఏషియన్ సినిమాస్ వారితో కలిసి శేఖర్ […]

కొత్త హీరోయిన్ నీ సెట్ చేసిన శేఖర్ కమ్ముల
X
శేఖర్ కమ్ముల ……ఈ పేరు వినగానే అందరికి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. శేఖర్ కమ్ముల సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. అలాంటి శేఖర్ కమ్ముల గత ఏడాది “ఫిదా” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తన సక్సెస్ రేట్ ని పెంచుకున్నాడు. ఆ రేంజ్ హిట్ అందుకున్నప్పటికి ఇప్పటి వరకు తన తదుపరి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చెయ్యలేదు శేఖర్ కమ్ముల. ఇకపోతే ప్రస్తుతం ఏషియన్ సినిమాస్ వారితో కలిసి శేఖర్ కమ్ముల ఒక సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లనే తీసుకుంటున్నాను అని శేఖర్ కమ్ముల ఇది వరకే ప్రకటించాడు.
శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు తను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కువ మంది కొత్త వాళ్ళనే పరిచయం చేస్తూ వచ్చాడు, పైగా వాళ్ళందరూ ఇప్పుడు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్నవారే. ఇక ఇప్పుడు కూడా మళ్ళి అందరూ కొత్తవాళ్ళని పరిచయం చేస్తూ సినిమా తీస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక తమిళ నటిని తీసుకున్నాడు కమ్ముల. కన్నడ అమ్మాయి అమృత అయర్ ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాడు. గతంలో ఈ భామ విజయ్ అంటోనీ హీరో గా నటించిన “కాలి” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
First Published:  20 Dec 2018 5:44 AM IST
Next Story