Telugu Global
Cinema & Entertainment

రజనీకాంత్ సినిమా తెలుగు టైటిల్ ఫిక్స్

ఓ వైపు థియేటర్లలో 2.O సినిమా నడుస్తోంది. ఇంతలోనే రజనీకాంత్ నుంచి మరో మూవీ రెడీ అయింది. దాని పేరు పెట్టా. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పొంగల్ కానుకగా కోలీవుడ్ లో జనవరి 11న గ్రాండ్ గా విడుదలకాబోతోంది. ఇప్పుడీ సినిమాకు తెలుగులో పేట అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పెట్టా అంటే తమిళ్ లో నగరం అని అర్థం. దాన్నే కొంచెం మార్చి తెలుగులో ‘పేట’గా మార్చారు. కానీ తెలుగులో పేట […]

రజనీకాంత్ సినిమా తెలుగు టైటిల్ ఫిక్స్
X

ఓ వైపు థియేటర్లలో 2.O సినిమా నడుస్తోంది. ఇంతలోనే రజనీకాంత్ నుంచి మరో మూవీ రెడీ అయింది. దాని పేరు పెట్టా. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పొంగల్ కానుకగా కోలీవుడ్ లో జనవరి 11న గ్రాండ్ గా విడుదలకాబోతోంది. ఇప్పుడీ సినిమాకు తెలుగులో పేట అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

పెట్టా అంటే తమిళ్ లో నగరం అని అర్థం. దాన్నే కొంచెం మార్చి తెలుగులో ‘పేట’గా మార్చారు. కానీ తెలుగులో పేట అంటే సిటీ అనే అర్థం రాదు. అదేదో చిన్న గ్రామం లేదా ఓ వీధి అనే మీనింగ్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ప్రాస కుదిరింది కాబట్టి టైటిల్ అలా పెట్టేశారంతే.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు పేట అనే టైటిల్ పెట్టడంతో పాటు ఈరోజే ఈ సినిమా పాటల్ని కూడా విడుదల చేశారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. గతంలో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్, త్రిష ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నటిస్తున్నారు.

అన్నట్టు ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వడం లేదు. తమిళ్ లో పొంగల్ కానుకగా వస్తున్న ఈ మూవీ తెలుగులో మాత్రం సంక్రాంతి కానుకగా రావడం లేదు. కుదిరితే జనవరి 25న, లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో పేటను టాలీవుడ్ తెరపైకి తీసుకురాబోతున్నారు.

First Published:  20 Dec 2018 1:19 PM IST
Next Story