తిరుమలలో సీఎం 20 నిమిషాలు మిస్సింగ్.... టీటీడీపై తీవ్ర విమర్శలు
తిరుమలలో మాజీ ప్రధాని దేవేగౌడ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలకు ఘోర అవమానం జరిగింది. ఇటీవల తిరుమలలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకలకు దేవేగౌడ, కుమార స్వామిలు రాష్ట్ర్ర ప్రభుత్వ అతిథులుగా వచ్చారు. అయితే దేవేగౌడ, కుమారస్వామిలను టీటీడీ అధికారులు పట్టించుకోలేదు. ప్రోటోకాల్‌ను కూడా మరిచిపోయి మాజీ ప్రధాని, కర్నాటక సీఎంలకు స్వాగతం పలికేందుకు సాధారణ ఉద్యోగులను పంపించారు. అంతటితో అయిపోలేదు. స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలోనూ వారిద్దరికి మరోసారి అవమానం జరిగింది. సీఎం కుమారస్వామిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ […]
తిరుమలలో మాజీ ప్రధాని దేవేగౌడ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలకు ఘోర అవమానం జరిగింది. ఇటీవల తిరుమలలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకలకు దేవేగౌడ, కుమార స్వామిలు రాష్ట్ర్ర ప్రభుత్వ అతిథులుగా వచ్చారు. అయితే దేవేగౌడ, కుమారస్వామిలను టీటీడీ అధికారులు పట్టించుకోలేదు.
ప్రోటోకాల్‌ను కూడా మరిచిపోయి మాజీ ప్రధాని, కర్నాటక సీఎంలకు స్వాగతం పలికేందుకు సాధారణ ఉద్యోగులను పంపించారు. అంతటితో అయిపోలేదు. స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలోనూ వారిద్దరికి మరోసారి అవమానం జరిగింది.
సీఎం కుమారస్వామిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద వదిలేసి ప్రోటోకాల్ సిబ్బంది వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఎలా వెళ్లాలో తెలియక కుమారస్వామి దిక్కులు చూస్తూ 20నిమిషాల పాటు అక్కడే ఉండిపోయారు. ముఖ్యమంత్రి ఆచూకీ తెలియక రాంభగీచ సత్రం వద్ద భద్రతా సిబ్బంది హైరానా పడ్డారు.
ఒక ప్రధాని, ఒక ముఖ్యమంత్రి పట్ల టీటీడీ వ్యవహరించిన తీరును కర్నాటక ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఆలయ జేఈవో కేవలం డబ్బున్న పారిశ్రామికవేత్తలకు మాత్రమే స్వాగతం పలుకుతూ వారి సేవలో తరించడం వల్లే మాజీ ప్రధానికి అవమానం జరిగిందని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ ఆరోపించారు. మాజీ ప్రధాని, కర్నాటక సీఎంలకు జరిగిన అవమానం ఇప్పుడు టీటీడీలో దుమారం రేపుతోంది.