Telugu Global
NEWS

రేవంత్ రెడ్డి ఓటమి సీక్రెట్ చెప్పిన ఓవైసీ....

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ఎన్నికల సందర్బంగా జరిగిన సంఘటనలను వివరించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన ఓవైసీ… కౌంటింగ్‌కు ముందు రోజు తాను కేసీఆర్ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఏం జరిగిందో వివరించారు. మూడు గంటల పాటు కేసీఆర్‌ ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో వెల్లడించారు. కేసీఆర్‌ ఇంటికి వెళ్లినప్పుడు తనను…. టీఆర్‌ఎస్‌కు ఎన్నిసీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారని కేసీఆర్‌ ప్రశ్నించారని ఓవైసీ చెప్పారు. అందుకు తాను 65-70 వరకు వస్తాయనుకుంటున్నానని చెప్పానన్నారు. […]

రేవంత్ రెడ్డి ఓటమి సీక్రెట్ చెప్పిన ఓవైసీ....
X

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ఎన్నికల సందర్బంగా జరిగిన సంఘటనలను వివరించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన ఓవైసీ… కౌంటింగ్‌కు ముందు రోజు తాను కేసీఆర్ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఏం జరిగిందో వివరించారు. మూడు గంటల పాటు కేసీఆర్‌ ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో వెల్లడించారు.

కేసీఆర్‌ ఇంటికి వెళ్లినప్పుడు తనను…. టీఆర్‌ఎస్‌కు ఎన్నిసీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారని కేసీఆర్‌ ప్రశ్నించారని ఓవైసీ చెప్పారు. అందుకు తాను 65-70 వరకు వస్తాయనుకుంటున్నానని చెప్పానన్నారు. కేసీఆర్‌ మాత్రం మీ అంచనా తప్పు… టీఆర్‌ఎస్‌కు 90 సీట్లు రాబోతున్నాయని చెప్పారన్నారు.

90 సీట్లు ఎలా వస్తాయో కూడా వివరిస్తానంటూ ప్రతి నియోజక వర్గానికి సంబంధించిన సమీకరణాలను కేసీఆర్‌ విడమరిచి వెల్లడించారని ఓవైసీ చెప్పారు. కేసీఆర్‌ ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉన్నారనుకుంటారని… కానీ సూక్ష్మ స్థాయిలోని పరిస్థితులను కూడా కేసీఆర్‌ స్డడీ చేశారన్న విషయం తనకు అప్పుడు అర్థమైందన్నారు.

మాటల మధ్యలో రేవంత్ రెడ్డి గెలుస్తారా? ఓడిపోతారా? మీ అంచనా ఏమిటని కేసీఆర్‌ తనను ప్రశ్నించారని ఓవైసీ చెప్పారు. అందుకు తాను రేవంత్ రెడ్డి గెలుస్తారని చెప్పగా…. లేదు రేవంత్ రెడ్డి ఓడిపోబోతున్నారని చెబుతూ…. అందుకు ఆ నియోజకవర్గంలోని పరిస్థితులనన్నింటినీ వివరంగా విశదీకరించారని, ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను వివరిస్తూ ఓట్ల సమీకరణాలు ఎలా మారుతాయో కేసీఆర్‌ చెప్పారన్నారు.

జానారెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి, పొన్నం, కొండా సురేఖ కూడా ఓడిపోతారని కేసీఆర్‌ చెప్పినప్పుడు ఆశ్చర్యమేసిందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కూడా ఓడిపోతున్నారని కేసీఆర్ ఆరోజే చెప్పారన్నారు ఓవైసీ.

తెలంగాణలోని అన్ని నియోజక వర్గాలపై కేసీఆర్‌కు ఉన్నంత పట్టు మరో నేతకు లేదని ఓవైసీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో ఒక్క జైపాల్ రెడ్డికి మాత్రం తెలంగాణలోని నియోజక వర్గాలు, అక్కడి నేతలపై కొంతవరకు అవగాహన ఉందని ఓవైసీ వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ వస్తే ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలే కనిపించడం లేదన్నారు. ఏపీలో ముస్లింలు ఎవరూ టీడీపీకి ఓటేసే పరిస్థితే లేదన్నారు ఓవైసీ.

First Published:  20 Dec 2018 5:22 AM IST
Next Story