Telugu Global
Cinema & Entertainment

బరువు తగ్గిన అనుష్క?

స్టార్ హీరోయిన్ అనుష్క “బాహుబలి” తరువాత నటించిన ఏకైక సినిమా “భాగమతి”. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు తన తదుపరి సినిమాని స్టార్ట్ చెయ్యలేదు అనుష్క. దీనికి కారణం అనుష్క బరువు పెరగడమే. “సైజు జీరో” సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఆ సినిమా తరువాత మళ్ళీ సన్నగా అవ్వడానికి ట్రై చేసినా సాధ్య పడలేదు. ఇక చేసేది లేక అదే బరువుని కవర్ చేస్తూ “భాగమతి” […]

బరువు తగ్గిన అనుష్క?
X

స్టార్ హీరోయిన్ అనుష్క “బాహుబలి” తరువాత నటించిన ఏకైక సినిమా “భాగమతి”. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు తన తదుపరి సినిమాని స్టార్ట్ చెయ్యలేదు అనుష్క. దీనికి కారణం అనుష్క బరువు పెరగడమే.

“సైజు జీరో” సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఆ సినిమా తరువాత మళ్ళీ సన్నగా అవ్వడానికి ట్రై చేసినా సాధ్య పడలేదు. ఇక చేసేది లేక అదే బరువుని కవర్ చేస్తూ “భాగమతి” సినిమాలో నటించింది అనుష్క.

ఇక ఇప్పుడు అనుష్క ఏడాది పాటు కష్టపడి మళ్ళీ తన మునుపటి రూపం కి వచ్చిందట. ఈ లుక్ ఇప్పటి వరకు బయటకి రాలేదు గాని త్వరలో జరగబోతున్న కార్తికేయ పెళ్ళిలో మాత్రం కొత్త అనుష్క ని చూడబోతున్నాం అనే టాక్ అయితే వినిపిస్తోంది.

ఇక అనుష్క బరువు తగ్గింది అని తెలియగానే స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ అందరూ తన డేట్స్ ని పట్టుకునే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే అనుష్క ప్రస్తుతం కోన వెంకట్ ప్రొడక్షన్ లో మాధవన్ హీరోగా ఒక సినిమాకి సైన్ చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

First Published:  20 Dec 2018 6:10 AM IST
Next Story