ఏపీలో వజ్రపు గనుల గుర్తింపు... ఇప్పటికే అక్కడ దొరుకుతున్న వజ్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో వజ్రపు గనుల ఆనవాళ్లు బయటపడ్డాయి. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ఈ గనుల ఆనవాళ్లను గుర్తించింది. అనంతపురం జిల్లాలో ఈ గనులు ఉన్నట్టు గుర్తించామని జీఎస్‌ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం. శ్రీధర్ తెలిపారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో ఓ మోస్తరు నాణ్యత ఉన్న వజ్రపు నిక్షేపాల ఆనవాళ్లను కనుగొన్నట్టు చెప్పారు. వీటిని శుధ్ది చేసి ఒక క్యారెట్ నాణ్యత గల వజ్రాలుగా మార్చవచ్చని ఆయన వివరించారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో […]
ఆంధ్రప్రదేశ్‌లో వజ్రపు గనుల ఆనవాళ్లు బయటపడ్డాయి. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ఈ గనుల ఆనవాళ్లను గుర్తించింది. అనంతపురం జిల్లాలో ఈ గనులు ఉన్నట్టు గుర్తించామని జీఎస్‌ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం. శ్రీధర్ తెలిపారు.
అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో ఓ మోస్తరు నాణ్యత ఉన్న వజ్రపు నిక్షేపాల ఆనవాళ్లను కనుగొన్నట్టు చెప్పారు. వీటిని శుధ్ది చేసి ఒక క్యారెట్ నాణ్యత గల వజ్రాలుగా మార్చవచ్చని ఆయన వివరించారు.
అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో చాలా కాలం నుంచే చిన్నచిన్న వజ్రాలు దొరుకుతున్నాయి. వర్షకాలం సమయంలో చేలల్లో చిన్నచిన్న వజ్రాలు పైకి తేలుతుంటాయి. ఆ సమయంలో వజ్రాలను వెతికేందుకు ఆ ప్రాంతంలో ప్రజలు పోటీ పడుతుంటారు.
వర్షకాలం సమయంలో చేలను దున్ని వదిలేస్తే.. మరోసారి వర్షం రాగానే నాగలి సాళ్ళల్లో చిన్నచిన్న వజ్రాలు బయటకు వస్తుంటాయి. వీటిని కొనుగోలు చేసేందుకు వర్షా కాలంలో ఇతర ప్రాంతాల నుంచి వజ్ర వ్యాపారులు వచ్చి వజ్రకరూర్ ప్రాంతంలో తిష్ట వేస్తుంటారు. చాలా మందికి విలువైన వజ్రాలు దొరికినా కూడా వాటి విలువ సరిగ్గా తెలియక వ్యాపారులకు అతి తక్కువ ధరకే విక్రయించి మోసపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి.