లగడపాటి మోసం, కుట్రపై ఫిర్యాదు
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఆంధ్రా ఆక్టోపస్‌గా అప్పటి వరకు ఉన్న పేరును తెలంగాణ ఎన్నికల సమయంలో పూర్తి పణంగా పెట్టేశారు. మహాకూటమిలో ఊపు తెచ్చేందుకు చంద్రబాబు కనుసన్నల్లోనే లగడపాటి సర్వేల పేరుతో జోస్యాలు చెప్పారన్న ఆరోపణ ఉంది. లగడపాటి వల్ల వేలాది మంది కోట్లాది రూపాయలను, ఆస్తులను బెట్టింగ్‌లో పెట్టి నాశనం అయిపోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా మహాకూటమే గెలుస్తుందని చెప్పిన లగడపాటి… అసలు ఫలితాల తర్వాత మీడియా […]
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఆంధ్రా ఆక్టోపస్‌గా అప్పటి వరకు ఉన్న పేరును తెలంగాణ ఎన్నికల సమయంలో పూర్తి పణంగా పెట్టేశారు. మహాకూటమిలో ఊపు తెచ్చేందుకు చంద్రబాబు కనుసన్నల్లోనే లగడపాటి సర్వేల పేరుతో జోస్యాలు చెప్పారన్న ఆరోపణ ఉంది.
లగడపాటి వల్ల వేలాది మంది కోట్లాది రూపాయలను, ఆస్తులను బెట్టింగ్‌లో పెట్టి నాశనం అయిపోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా మహాకూటమే గెలుస్తుందని చెప్పిన లగడపాటి… అసలు ఫలితాల తర్వాత మీడియా ముందుకు రాలేదు. లగడపాటి చెప్పిన దానికి… అసలు ఫలితాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపించింది. దీంతో లగడపాటిపై అనేక అనుమానులు, ఆరోపణలు వచ్చాయి.
జనాన్ని తప్పుదోవ పట్టించి, ఫలితాలను తారు మారు చేసేందుకు లగడపాటి కుట్ర చేశారన్న ఆరోపణ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ నేతలు మరో అడుగు ముందుకేశారు. లగడపాటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్ నేత సత్తు వెంకటరమణా రెడ్డి… రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిసి లగడపాటిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఎన్నికలకు ముందు ఎలాంటి సర్వే ఫలితాలు వెల్లడించవద్దని ఎన్నికల కమిషన్ నింబధనలు ఉన్నప్పటికీ లగడపాటి మాత్రం ఎనిమిది నుంచి పది మంది ఇండిపెండెంట్లు గెలువబోతున్నారని చెప్పడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని వివరించారు.
బోధ్‌లో జాదవ్ అనిల్‌కుమార్, నారాయణపేట్‌లో శివకుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌లో జలంధర్‌రెడ్డి, బెల్లంపల్లిలో జి.వినోద్ గెలుస్తారని ప్రకటనలు చేసిన లగడపాటి… మరో మూడు స్థానాల్లో అక్కడి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్వే ఫలితాలు వెల్లడించడం లేదని చెప్పారని.. ఇలా చేయడం ద్వారా ఓటర్లను తప్పుదారి పట్టించడంతో పాటు, బ్లాక్‌మెయిల్, మోసం వంటి చర్యలకు లగడపాటి దిగారని ఫిర్యాదులో వివరించారు.
లగడపాటిని నమ్మి ఎంతో మంది బెట్టింగ్‌లు కాచి భారీగా నష్టపోయారని వివరించారు. ఇలాంటి తప్పుడు సర్వే ఫలితాలను వెల్లడించే వారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎన్నికల ప్రక్రియే అపహాస్యం అయ్యే ప్రమాదం ఉందని టీఆర్‌ఎస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు ఫలితాలను పరిశీలిస్తే లగడపాటి చెప్పిన వారిలో ఒక్కరు కూడా గెలవలేదని ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్‌ఎస్ నేత వెంటకరమణా రెడ్డి తన ఫిర్యాదులో వివరించారు.