Telugu Global
Cinema & Entertainment

బాలక్రిష్ణ సినిమాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిరివెన్నెల సీత రామ శాస్త్రి

వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో వస్తున్న సినిమా “అంతరిక్షం”. డిసెంబర్ 21 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా యొక్క ఆడియో ఈవెంట్ ని నిర్వహించారు నిర్మాతలు. అయితే ఈ ఆడియో ఈవెంట్ లో సిరివెన్నెల సీత రామ శాస్త్రి మాట్లాడుతూ తెలుగు సినిమా పై అలాగే బాలక్రిష్ణ సినిమాల పై ఇన్ డైరెక్ట్  గా కామెంట్ చేసాడు. తను మాట్లాడుతూ “తెలుగు సినిమా అనేది ప్రస్తుతం మంచి వాతావరణంలో […]

బాలక్రిష్ణ సినిమాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిరివెన్నెల సీత రామ శాస్త్రి
X

వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో వస్తున్న సినిమా “అంతరిక్షం”. డిసెంబర్ 21 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా యొక్క ఆడియో ఈవెంట్ ని నిర్వహించారు నిర్మాతలు. అయితే ఈ ఆడియో ఈవెంట్ లో సిరివెన్నెల సీత రామ శాస్త్రి మాట్లాడుతూ తెలుగు సినిమా పై అలాగే బాలక్రిష్ణ సినిమాల పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేసాడు.

తను మాట్లాడుతూ “తెలుగు సినిమా అనేది ప్రస్తుతం మంచి వాతావరణంలో ఉంది. గత రెండేళ్ళ నుంచి తెలుగు సినిమాకి మంచి రోజులతో పాటు మంచి మంచి సినిమాలు కూడా వచ్చాయి. అసలు ఈ మార్పు ప్రేక్షకుల నుంచి వచ్చిందా ? దర్శకుల నుంచి వచ్చిందా ? అసలు సినిమా కథల నుంచి వచ్చిందా అనే విషయం తెలియదు గాని తెలుగులో మాత్రం ఇప్పటి నుంచి అన్ని మంచి చిత్రాలే రావాలి. ఒక హీరో భూమి మీద అడుగు పెట్టగానే భూమి పై భూకంపం రావడం, అలాగే హీరో కను సైగ చేయగానే ట్రైన్ ఆగిపోవడాలు ఇవన్ని మన ప్రేక్షకులకి చికాకు తెప్పిస్తున్నాయి. కానీ సంకల్ప్ రెడ్డి మాత్రం వీటన్నింటికి భిన్నంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి కొత్త రక్తమే ఇండస్ట్రీ కావాలి అంటూ చెప్పుకొచ్చాడు సిరివెన్నెల సీత రామ శాస్త్రి.

First Published:  19 Dec 2018 2:56 AM IST
Next Story